మార్చ్ 15న సందడి చేయనున్న " సేవ్ ది టైగర్స్ ".. విడుదలైన ట్రైలర్

     Written by : smtv Desk | Mon, Mar 04, 2024, 10:56 AM

మార్చ్ 15న సందడి చేయనున్న

సేవ్ ది టైగర్స్ ఈ వెబ్ సిరీస్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. మూడు విభిన్నమైన మనస్తత్వాలు గల జంటల జీవితాల పై తెరకెక్కిన ఈ సిరీస్ లో కంటెంట్ తో పాటు ఫుల్ కామెడీ కూడా జోడించి ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యారు.
సరదాగా సాగిపోయిన ఈ కామెడీ సిరీస్ సీక్వెల్ కొరకు ప్రేక్షకులు ఈగర్ గా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రేక్షకులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సేవ్ ది టైగర్స్ 2 ట్రైలర్ మార్చ్ 2న విడుదలైంది. విడుదలైన ట్రైలర్ కు మంచి స్పందన లభిస్తుంది. మార్చ్ 15 వ తేదిన డిస్నీ ప్లస్ హాట్స్టార్ లో స్ట్రీమింగ్ అవనున్న ఈ సిరీస్ లో ప్రియదర్శి, అభినవ్ గౌతమ్, చైతన్య కృష్ణలు హీరోలు కాగా వారి సరసన జోర్దర్ సుజాత, పావని, దేవయాని శర్మ హీరోయిన్లుగా నటించారు. మొదటి పార్ట్ లో కమెడియన్ రోహిణి పనిమనిషి పాత్రలో అదరగొట్టిన విషయం తెలిసిందే. ఈసారి సెకండ్ పార్ట్ లో వీరితో పాటు ప్రముఖ నటుడు, బలగం సినిమా డైరెక్టర్ వేణు, ప్రముఖ నటి సత్య కృష్ణ, బిగ్ బాస్ ఫెమ్ గంగవ్వ, జబర్దస్ ఫేమ్ ముక్కు అవినాష్ వంటి వారు ట్రైలర్ లో కనిపించడంతో సిరీస్ మీద అంచనాలు మరింత పెరిగాయి.
https://youtu.be/VpJbvKrDCSI?si=eQkhTLUu70bfPlCK





Untitled Document
Advertisements