చేతినిండా సినిమాలతో బీజీగా మారిన గుంటూరు కారం ముద్దుగుమ్మ

     Written by : smtv Desk | Mon, Mar 04, 2024, 01:44 PM

చేతినిండా సినిమాలతో బీజీగా మారిన గుంటూరు కారం ముద్దుగుమ్మ

ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొత్తలోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపును సొంతం చేసుకుంది మీనాక్షి చౌదరి . ఆ తర్వాత వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ ఇటు తెలుగు, అటు తమిళ రాష్ట్రాల్లో బాగా పాపులర్ అవడంతో పాటు అవకాశాలు అందుకుంటుంది .తన సొగసైన అంధ చందాలతో ప్రేక్షకులని మైమరిపించి మొదటి సినిమాతో కుర్రా ల గుండెలలో నిండుకున్న చిన్నది గుంటూరు కారంలో,మహేష్ బాబు సరసన నటించిన తర్వాత తన దిశ మారినట్లు తెలుస్తుంది . అయితే ఆమె పాత్రకి ఈ సినిమాలో పెద్ద ప్రాధాన్యత లేదు. ప్రస్తుతం టాలీవుడ్ లో గట్టిగా వినిపిస్తోన్న పేరు ఇది . ఈ బ్యూటీ బ్యాక్ టూ బ్యాక్ మూవీస్ చేసుకుంటూ స్టార్ హీరోయిన్ గా రేసులోకి వస్తోంది. ఇప్పుడు ఇటు తెలుగు, అటు తమిళ భాషలలో మీనాక్షి చౌదరికి ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం ఇళయదళపతి విజయ్ GOAT సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. విజయ్ ఆంటోనీ హీరోగా తెరకెక్కిన కొలై అనే సినిమాతో కోలీవుడ్ లోకి మీనాక్షి చౌదరి ఎంట్రీ ఇచ్చింది. తరువాత సింగపూర్ సెలూన్ అనే చిత్రంతో నటించింది. ఇప్పుడు ఏకంగా విజయ్ కి జోడీగా నటిస్తోంది. తెలుగులో గుంటూరు కారం సినిమాలో ఆమె గెస్ట్ రోల్ కి పరిమితం అయిన కూడా అవకాశాలు మాత్రం బాగానే వస్తున్నాయి,ఈ గుంటూరు సినిమాతో ఎంతో కొంత గొప్ప హిట్ సంపాదించుకున్నది ,అంతేకాకుండా నిత్యం హాట్ హాట్ ఫోటోషూట్ తో రెచ్చిపోయే ఈ భామ టాలెంట్ ని ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ ఎట్టకేలకు సినిమాలను తన చేతి నిండా పెట్టుకున్నది.





Untitled Document
Advertisements