బాలకృష్ణ, బోయపాటి శ్రీను ల నుండి మరో బ్లాక్ బస్టర్ మూవీ!

     Written by : smtv Desk | Mon, Mar 04, 2024, 01:49 PM

బాలకృష్ణ, బోయపాటి శ్రీను ల నుండి మరో బ్లాక్ బస్టర్ మూవీ!

మొట్ట మొదట భైరవద్వీపం సినిమాకి ఫిలింఫేవర్ అవార్డు అందుకున్న నందమూరి బాలకృష్ణ ,వైవిద్య భరితమైన పాత్రలు పోషించడమే కాకుండా జానపద, సాంఘిక, చారిత్రక, పౌరాణిక పాత్రలను, పోషించడంలో కూడా సుప్రసిద్ధుడు, అంతే కాకుండా తన పద జాలంతో ,వాక్ చాతుర్యంతో , ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు. ఇప్పటికే నందమూరి బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన సింహా, లెజెండ్‌, అఖండ సినిమాలు భారీ బ్లాక్ బస్టర్ విజయాలను సొంతం చేసుకున్నాయి. దాంతో వీరిద్దరి కాంబోలో డబుల్ హ్యాట్రిక్ సినిమా కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే అఖండ 2 వీరి కాంబోలో రాబోతున్న నాల్గవ సినిమా అంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆ మధ్య బాలకృష్ణ మరియు బోయపాటి శ్రీను ఇద్దరూ తాము అఖండ సీక్వెల్‌ చేయబోతున్నట్లుగా ప్రకటించారు. బాలకృష్ణ బ్యాక్‌ టు బ్యాక్‌ విజయాలతో జోరు మీద ఉన్నాడు. ఇదే సమయంలో అఖండ సీక్వెల్‌ చేస్తే కచ్చితంగా ఓ మంచి రికార్డ్‌ బ్రేకింగ్‌ సినిమా వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు .
ఇలాంటి సమయంలో అఖండ 2 గురించి పలు రకాలుగావార్తలు వస్తున్నాయి ఇండస్ట్రీ వర్గాల్లో తాజా ప్రచారం ప్రకారం అఖండ 2 లో బాలకృష్ణ అఘోర గెటప్‌ తో పాటు సెకండ్‌ హాఫ్‌ లో సాధువు లుక్ లో కూడా కనిపించబోతున్నాడట. ఆ లుక్ కోసం మరింత శ్రద్ధ గా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. సినిమాలో బాలకృష్ణ ను విభిన్నమైన పాత్రల్లో చూడబోతున్నాం. అఖండ లో రెండు పాత్రల్లో చూసిన విషయం తెల్సిందే. ఇప్పుడు అఖండ 2 లో అంతకు మించి అన్నట్లుగా మూడు విభిన్నమైన పాత్రల్లో బాలయ్య ను దర్శకుడు బోయపాటి చూపించబోతున్నాడని సమాచారం అందుతోంది.
సాధువు పాత్ర స్క్రీన్‌ టైమ్‌ 20 నుంచి 25 నిమిషాలు మాత్రమే ఉంటుందట. అయినా కూడా ఆ పాత్ర సినిమాకు అత్యంత కీలకంగా ఉంటుందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. మొత్తానికి అఖండ 2 గురించి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాకుండానే అనేక పుకార్లు వెలువడుతున్నాయి ఇప్పుడు బాలకృష్ణ ఎన్నికల ప్రచారంలో ఉండడం వలన ఎలాంటి సమాచారం గురించి అయిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.





Untitled Document
Advertisements