రహస్య గూఢచారిగా ఎన్టీఆర్.. ‘వార్-2’ మూవీ అప్డేట్స్

     Written by : smtv Desk | Wed, Mar 06, 2024, 09:20 AM

రహస్య గూఢచారిగా ఎన్టీఆర్..  ‘వార్-2’ మూవీ అప్డేట్స్

ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిన ‘యంగ్ టైగర్’ ఎన్టీఆర్ తాజా చిత్రం అప్డేట్స్ కొరకు అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సమయంలో ఎన్టీఆర్ నటిస్తున్న ‘వార్-2’ చిత్రానికి సంబంధించి ఓ అప్డేట్ బయటకు వచ్చింది.. ‘యంగ్ టైగర్’ సరికొత్త పాత్ర పోషించబోతున్నాడా? బాలీవుడ్ సినిమా ‘వార్-2’లో సీక్రెట్ ఏజెంట్ పాత్రలో అలరించబోతున్నాడా?.. అంటే ఔననే అంటున్నాయి సినీ వర్గాలు. రహస్య గూఢచారిగా నటించబోతున్నాడని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. భారత్‌కు చెందిన సీక్రెట్ ఏజెంట్‌గా ఈ పాత్ర పాజిటివ్‌గా ఉంటుందని తెలుస్తోంది. కాగా వార్-2 మూవీలో ఎన్టీఆర్ నటించబోతున్నాడని నిర్ధారణ అయినప్పటికీ క్యారెక్టర్‌పై సస్పెన్స్ వీడలేదు. ఈ సమయంలో ఈ వార్త సినీ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. కాగా త్వరలో ఎన్టీఆర్‌ ఈ సినిమాలో షూటింగ్‌లో పాల్గొనబోతున్నారు.
కాగా హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘వార్‌ 2’ మల్టీస్టారర్ మూవీ. అయాన్‌ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్‌ నటిస్తున్నాడు. ఈ సినిమాని ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు. ‘వార్‌ 2’ సినిమా వచ్చే ఏడాది ఆగస్టు 14న విడుదల కానుంది. మరి ఈ చిత్రం ఏ విధంగా ఉండబోతుంది అనే ఆసక్తి మరింత పెరిగింది అభిమానులలో. ప్రేక్షకులలో భారీ అంచనాలను పెంచిన ఈ చిత్రం విడుదలకు ఇంకా సంవత్సర కాలం ఎదురుచుడక తప్పదు.





Untitled Document
Advertisements