అపర కుబేరుడి ఇంట పెళ్లి వేడుకలు.. వారంతా డబ్బు తీసుకునే వెళ్ళారా?

     Written by : smtv Desk | Thu, Mar 07, 2024, 05:32 PM

అపర కుబేరుడి ఇంట పెళ్లి వేడుకలు.. వారంతా డబ్బు తీసుకునే వెళ్ళారా?

రిలయన్స్ అధినేత దేశంలోనే అపర కుబేరుడుగా పేరు పొందిన అంబానీ ఫ్యామిలీలో పెళ్ళి గురించి వర్ణించాలి అంటే మాటలు సరిపోవు, అలాంటి పెళ్ళికి ఆహ్వానం దొరకడం అంటే చాల అదృష్టంగా భావిస్తారు . తాజాగా ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ పెళ్లి వేడుకలో బాలీవుడ్ సెలబ్రెటీలు చాలా మంది సందడి చేశారు. సౌత్ నుంచి మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ దంపతులు హాజరయ్యారు. అలాగే మాజీ క్రికెట్ కెప్టెన్ ధోని, రోహిత్ శర్మ కూడ తమ ఫ్యామిలీతో కలిసి ఈ వెడ్డింగ్ కి హాజరయ్యారు. ఓ విధంగా ఈ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్ స్టార్స్ తో నిండిపోయింది. ఫ్యామిలీ వేడుక అంటే సెలబ్రెటీలు . ఈ ప్రీవెడ్డింగ్ వేడుకలో షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ లాంటి స్టార్స్ స్టేజ్ మీద డాన్స్ లు కూడా చేశారు. ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు సాంగ్ కి రాంచరణ్ తో కలిసి చిందులేశారు. ఇప్పుడు ఈ వీడియోలు వైరల్ అయ్యాయి. సోషల్ మీడియాలో అంబానీ పెళ్లి వేడుక టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయింది. అయితే కార్పొరేట్ వ్యాపారుల ఇంట్లో ఫంక్షన్స్, పెళ్లిళ్లకి హాజరైతే సెలబ్రెటీలకి కోట్ల రూపాయిల చెల్లిస్తారంట.
గతంలో కింగ్ నాగార్జున ఈ విషయాన్ని చెప్పాడు. ప్రస్తుతం ఆ వ్యాఖ్యలు మరోసారి వైరల్ అవుతున్నాయి. వ్యాపారుల ఇంట్లో జరిగే పెళ్లిళ్లకి వస్తే డబ్బులు ఇస్తామని ఆహ్వానాలు వస్తాయి అని టాక్ వస్తుంది . మనీ కోసం ఎవరు ఆశ పడరు నచ్చిన వాళ్ళు వెళ్తూ ఉంటారు. అయితే నాగార్జున తనకు కూడా అలాంటి ఆఫర్స్ చాలా సార్లు వచ్చాయి. అయితే అలా డబ్బులు తీసుకొని ఈవెంట్స్ కి వెళ్లే అలవాటు తనకి లేదని, అందుకే వచ్చిన ఆఫర్స్ ని కూడా తిరస్కరించినట్లు చెప్పారు. అయితే ఈ వేడుకల్లో అందరూ కూడా డబ్బులు తీసికొని వెళ్ళారా.. కొందరు అంబానీకి సన్నిహితులుగా ఉంటారు. రామ్ చరణ్ అయితే ఒక మంచి స్నేహ భావంతోనే అక్కడికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఇక రీసెంట్ గా కంగనా అనంత్ అంబానీ ప్రీవెడ్డింగ్ ఈవెంట్ లో సెలబ్రేటీలు డాన్స్ లు చేయడంపై రియాక్ట్ అయ్యింది. డబ్బులు తీసుకొని అలాంటి కార్పొరేట్ ఈవెంట్స్ కి వెళ్లి డాన్స్ లు చేసే నైజం తనది కాదు. నాకు ఆత్మగౌరవం ఉంది. నా వ్యక్తిత్వాన్ని ఎప్పటికి వదులుకోను అంటూ కామెంట్స్ చేసి పరోక్షంగా ఖాన్ త్రయంపై కామెంట్స్ చేసింది.

ఏది ఏమైనా అంబానీ ఫ్యామిలీలో జరిగిన ఈవెంట్స్ కి వచ్చిన సెలబ్రేటీలు అందరూ మనీ తీసుకొని వచ్చారా స్నేహ భావంతో వచ్చారా అనే విషయం తెలియాల్సింది ఉంది . ఏది ఎలా ఉన్నా అపర కుబేరుల ఇంట్లో జరిగిన ప్రీ వెడ్డింగ్ వేడుకలకు బాలీవుడ్ సెలబ్రెటీలు ఎలా వెళ్ళారు అనే టాపిక్ ప్రస్తుతం వైరల్ గా మారింది.





Untitled Document
Advertisements