సూర్యకిరణ్ మరణానికి భార్యనే కారణమా ?

     Written by : smtv Desk | Tue, Mar 12, 2024, 04:24 PM

సూర్యకిరణ్ మరణానికి భార్యనే కారణమా ?

సూర్యకిరణ్ దర్శకుడే కాకుండా మంచి నటుడు, డ్యాన్సర్, సింగర్ కూడా. బాల నటుడిగా 200కు పైగా చిత్రాలు చేశాడు. నంది అవార్డులు కూడా అందుకున్నాడు. 1990 వరకు ఆయన నటుడిగా కొనసాగాడు. 2003లో వచ్చిన 'సత్యం' సినిమాతో డైరెక్టర్ గా మారాడు. సుమంత్, జెనీలియా జంటగా తెరకెక్కిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది.
తెలుగు బిగ్ బాస్‌లోనూ ఆయన పాలుపంచుకోవడం గమనార్హం. కానీ ప్రారంభంలోనే ఆయన ఎలిమినేట్‌ అయ్యారు . చిన్న వయసులోనే అనారోగ్య కారణాలతో ఆయన చనిపోవడం కలచి వేస్తోంది. కామెర్ల బారిన పడిన ఆయన చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న తుదిశ్వాస విడిచారు.
హీరోయిన్ కల్యాణిని సూర్యకిరణ్ ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. భార్యను సూర్యకిరణ్ గుండెల నిండా నింపుకున్నాడని, ఆమె దూరం కావడంతో తట్టుకోలేక పోయాడు ఈ లోకంలో తనకంటూ ఏమీ లేదని తాగుడుకు బానిసయ్యాడు . రాత్రంతా మందు, సిగరెట్లు తాగుతూ ఉండేవాడని, దీంతో ఆరోగ్యం దెబ్బతిందని తెలిపారు. తాగుడు వల్లే ఆయనకు జాండిస్ వచ్చిందని... జాండిస్ కారణంగానే మృతి చెందాడని చెప్పారు. ఏది ఏమైనా ఒక మంచి దర్శకుడిని కోల్పోవడం చాల బాధాకరం . ఏ పగ వాడికి కూడా ఇలాంటి కష్టము రాకూడదు .





Untitled Document
Advertisements