మరోసారి యాక్షన్ చిత్రంతో తన అదృష్టాన్ని పరిక్షించుకోనున్న అఖిల్

     Written by : smtv Desk | Wed, Mar 13, 2024, 07:47 PM

మరోసారి యాక్షన్ చిత్రంతో తన అదృష్టాన్ని పరిక్షించుకోనున్న అఖిల్

బాల నటుడిగా సిసింద్రి సినిమాలో నటించి మంచి పేరు తెచ్చుకున్న అక్కినేని యువ హీరో అఖిల్ కెరియర్ ఆశించిన స్థాయిలో సక్సెస్ ఫుల్ గా లేదు. గత ఏడాది అఖిల్ ఏజెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చి డిజాస్టర్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా నిర్మాత అనిల్ సుంకరకి భారీగా నష్టం తీసుకొచ్చింది. దర్శకుడిగా సురేందర్ రెడ్డి ఇమేజ్ ని కూడా డ్యామేజ్ చేసింది. అయితే నటుడిగా అఖిల్ కష్టం సినిమాలో ప్రతి ఫ్రేమ్ లో కనిపించడంతో ప్రేక్షకులు అతన్ని యాక్సప్ట్ చేశారు. ఏజెంట్ డిజాస్టర్ ఎఫెక్ట్ నుంచి కోలుకోవడానికి కొంత సమయం పట్టింది . మళ్ళీ కొత్త కథని లైన్ లో పెట్టడానికి అఖిల్ చాలా సమయం తీసుకున్నాడు. గత ఏడాది నుంచి యూవీ క్రియేషన్స్ అఖిల్ హీరోగా ఏకంగా వంద కోట్ల బడ్జెట్ తో మూవీ చేయబోతోంది అంటూ ప్రచారం నడుస్తోంది. సాహో, రాధేశ్యామ్ సినిమాలకి రైటింగ్, డైరెక్షన్ టీంలో వర్క్ చేసిన అనిల్ కుమార్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఈ మూవీ చేయాలని ప్లానింగ్ లో ఉన్నారు.

ఇప్పటికే అఖిల్ కి డైరెక్టర్ కథ చెప్పి ఒకే చేయించుకున్నాడంట. ఈ సినిమాకి సంబందించిన అప్డేట్ వారం రోజుల్లో వచ్చే అవకాశం ఉందంట. యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో చేయబోయే ఈ మూవీ ఫుల్ యాక్షన్ మిస్టరీ, ఫాంటసీ థ్రిల్లర్ జోనర్ లో ఉండొచ్చనే ప్రచారం నడుస్తోంది. అఖిల్ తో సినిమా చేయబోయే అనిల్ కుమార్ యువీ క్రియేషన్స్ లో రూపొందిన కొన్ని సినిమాలకు తన ఐడియాలు అందించి మంచి గుర్తింపు అందుకున్నాడు. దీంతో సినిమాని కూడా అద్భుతంగా ఆవిష్కరిస్తాడని బలంగా నమ్ముతున్నారు. ఈ సినిమాపై ఫస్ట్ అప్డేట్ తో చిత్ర యూనిట్ ఎలాంటి హైప్ పెంచుతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక అఖిల్ తో సినిమా చేయడానికి ఇటీవల సక్సెస్ అందుకున్న కొంతమంది యువ దర్శకులు కూడా సిద్ధంగా ఉన్నట్లు టాక్ వచ్చింది. ముఖ్యంగా దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెలా పేరు కూడా గట్టిగానే వినిపించింది. అలాగే వక్కంతం వంశీ కేవలం కథను అంధించే ప్రయత్నంలో ఉన్నట్లు ఇండస్ట్రీలో మరొక టాక్ వచ్చింది. అయితే అఖిల్ మంచి యాక్షన్ హీరో మెటీరియల్ అని టాలీవుడ్ లో వినిపించే మాట. అందుకే ఈ కుర్ర హీరోకి సక్సెస్ లు తక్కువ ఉన్న బడా నిర్మాతలు భారీ బడ్జెట్ తో సినిమాలు చేయడానికి ముందుకొస్తూ ఉంటారు. ఈ సినిమా అయినా ప్రేక్షకులని మెప్పించి అఖిల్ ని సక్సెస్ వైపు నడిపిస్తుందో లేదో చూడాలి .





Untitled Document
Advertisements