ఏఐ టెక్నాలజీతో డబ్బింగ్ ఆర్టిస్టులకు ఇబ్బందులు తప్పేట్టుగా లేవుగా

     Written by : smtv Desk | Thu, Mar 14, 2024, 01:41 PM

ఏఐ టెక్నాలజీతో డబ్బింగ్ ఆర్టిస్టులకు ఇబ్బందులు తప్పేట్టుగా లేవుగా

ప్రస్తుతకాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఏఐ టెక్నాలజీ. ఇటీవల పలు సినిమాల్లోకూడా ఏఐ టెక్నాలజీని ఉపయోగించారు ఆయా మూవీ మేకర్స్. ఏఐ అంటే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ .ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు సోషల్‌ మీడియా సైట్స్‌ మొదలుకొని , ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్స్‌ వరకు అన్నీ ఏఐ టెక్నాలజీని వినియోగించుకోవాల్సి పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే టెక్‌ దిగ్గజాలన్నీ ఏఐ వినియోగాన్ని మొదలుపెట్టేశాయి.దీని వలన ఎలాంటి నష్టాలు రాకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నాయి. ఇక సినీ ఇండస్ట్రీలో కూడా ఏఐ వాడకం రోజురోజుకూ పెరుగుతోంది.ఎలాగంటే గత ఏడాది నాని హీరోగా నటించిన హాయ్ నాన్నలో ఓ సీన్ కోసం ఫారిన్ లేడీ వాయిస్ కోసం ఏఐ ద్వారానే క్రియేట్ చేశారు. లాల్ సలామ్ మూవీకి గాను మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఆర్ రెహమాన్ ఇలానే చేశారు. ఏఐ సాయంతో వాయిస్ కాదు ఓ తెలుగు మూవీ కోసం లిరికల్ వీడియో కూడా సృష్టించారు. ఇప్పుడు ఈ టెక్నాలజీని వాడి ఏకంగా పలు సినిమాలకు గాను డబ్బింగ్ చెప్పిస్తున్నారట మేకర్స్. ఈ విషయం విని ఒక్కసారిగా విని షాకయ్యారా.. కానీ ఇది నిజమే. త్వరలో రిలీజ్ కానున్న పలు తెలుగు సినిమాలకు ఇదే జరిగిందట. ఒకటో రెండో డైలాగులు ఉన్న క్యారెక్టర్ల డబ్బింగ్ ను ఏఐతో మేకర్స్ చెప్పించారట. డబ్బింగ్ ఆర్టిస్టులకు ఇచ్చే రెమ్యూనరేషన్లు సేవ్ చేసేందుకు ఇలా చేస్తున్నారట.దీని బట్టి చూస్తే భవిష్యత్తులో డబ్బింగ్ ఆర్టిస్టులు ఇబ్బంది పడే అవకాశాలు వస్తాయేమో , సినిమా హీరోలు కూడా ఏఐ టెక్నాలజీకి అలవాటు పడతారమోనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు కొందరు నెటిజన్లు. బిజీగా ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా ఏఐనే ఫాలో అవుతారని అంటున్నారు. అయితే ఏఐతో ఎవరి వాయిస్ అయినా ఈజీగా క్రియేట్ చేయవచ్చు. ఒరిజినల్ కు ఏఐ వాయిస్ కూడా ఎలాంటి తేడా ఉండదు. అసలు డౌట్ కూడా రాదు. మరి ఫ్యూచర్ లో ఇలాగే కొనసాగితే ఏ ఐ వల్ల సినిమా రంగంలో ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి మరి .





Untitled Document
Advertisements