దగ్గుబాటి వారి పెళ్లి వేడుక.. ఘనంగా వెంకటేష్ రెండవ కూతురు వివాహం

     Written by : smtv Desk | Sat, Mar 16, 2024, 07:41 AM

దగ్గుబాటి వారి పెళ్లి వేడుక.. ఘనంగా వెంకటేష్ రెండవ కూతురు వివాహం

కుటుంబ కథా చిత్రాల హీరోగా పేరున్న సీనియర్ హీరో వెంకటేష్ తన కుటుంబాన్ని ఎప్పుడు కూడా ఇండస్ట్రీకి దూరంగానే ఉంచుతూ వచ్చారు. తాజాగా దగ్గుబాటి వారి ఇంట పెళ్లి సందడి నెలకొంది. వెంకటేష్ 2వ కుమార్తె హయవాహినికి విజయవాడకు చెందిన ఓ డాక్టర్ కుమారుడు నిషాంత్‌ తో వివాహం జరిగింది. రామానాయుడు స్టూడియోలో కుటుంబసభ్యులు, శ్రేయోభిలాషుల సమక్షంలో వైభవంగా ఈ వేడుక జరిగింది.

గతేడాది అక్టోబర్‌లో నిషాంత్, హయవాహినిల నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. అప్పట్లో చిరంజీవి, మహేశ్ బాబు, రానా, నాగచైతన్య హాజరై కాబోయే దంపతులను ఆశీర్వదించారు. వెంకటేశ్, నీరజ దంపతులకు కుమార్తెలు ఆశ్రిత, హయవాహిని, భావన, కుమారుడు అర్జున్ ఉన్నారు. పెద్ద కూతురు ఆమె భర్తతో కలిసి విదేశాల్లో ఉంటున్నారు. ఇప్పుడు రెండవ కుమార్తె వివాహం ఘనంగా జరిపించారు.





Untitled Document
Advertisements