పెనుప్రమాదం తప్పించుకున్న సింగర్ మంగ్లీ.. ఆమె ప్రయాణిస్తున్న కారుకు యాక్సిడెంట్

     Written by : smtv Desk | Mon, Mar 18, 2024, 07:07 AM

పెనుప్రమాదం తప్పించుకున్న సింగర్ మంగ్లీ.. ఆమె ప్రయాణిస్తున్న కారుకు యాక్సిడెంట్

బంజారా పాటులు పాడుతూ నెమ్మదిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన మంగ్లీ తన అద్భుతమైన గాత్రంతో ఎన్నో పాటు పాడి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకుని నేడు ప్రముఖ గాయినిగా పేరు తెచ్చుకుంది. అయితే తాజగా మంగ్లీకి త్రుటిలో ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న కారును డీసీఎం వెనక నుంచి ఢీకొట్టగా ఆమెతో పాటు కారులోని ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. హైదరాబాద్ - బెంగళూరు జాతీయ రహదారిపై తొండుపల్లి వంతెన వద్ద ఈ ప్రమాదం జరిగిందని శంషాబాద్ పోలీసులు తెలిపారు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హా శాంతి వనంలో ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవానికి మంగ్లీ శనివారం హాజరయ్యారు. ఆ తరువాత అర్ధరాత్రి తిరిగొస్తుండగా డీసీఎం వారి కారును ఢీకొట్టింది. ఈ క్రమంలో మంగ్లీతో పాటు కారులోని మేఘరాజ్, మనోహర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. కారు వెనక భాగం కూడా దెబ్బతింది. డీసీఎం డ్రైవర్ మద్యం మత్తులో ఉన్న కారణంగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో రిలీఫ్ ఫీల్ అయ్యారు.





Untitled Document
Advertisements