నటుడిగా, నిర్మాతగా, రాజ‌కీయ నాయ‌కుడిగా విలక్షణ నటుడు మోహ‌న్ బాబు చరిత్ర

     Written by : smtv Desk | Tue, Mar 19, 2024, 03:30 PM

నటుడిగా,  నిర్మాతగా, రాజ‌కీయ నాయ‌కుడిగా విలక్షణ నటుడు మోహ‌న్ బాబు చరిత్ర

మోహ‌న్ బాబు అస‌లు పేరు. మ‌ద్రాసు రాజ‌ధానిగా ఉన్న‌ప్పుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని మోదుగుల పాలెం నుంచి భ‌క్త‌వ‌త్స‌లం నాయుడు అలియాస్ మోహ‌న్ బాబు మ‌ద్రాసుకు ప‌య‌న‌మ‌య్యారు. నాటి రోజులు వేరు. పేద‌రికం వేరు. మోహ‌న్ బాబు మ‌ద్రాస్‌ ఫిలింఇనిస్టిట్యూట్ లో న‌ట‌విద్య‌ను అభ్య‌సించి అటుపై ద‌ర్శ‌క‌ర‌త్న‌ దాస‌రి నారాయ‌ణ‌రావు అండ‌దండ‌ల‌తో న‌టుడిగా కెరీర్ ని సాగించారు. అదే క్ర‌మంలోనే త‌ల్లిదండ్రులు మంచు నారాయ‌ణ‌స్వామి- ల‌క్ష్మ‌మ్మ అండ‌దండ‌లు త‌న ఎదుగుద‌ల‌కు స‌హ‌క‌రించాయి

విల‌న్ గా స‌హాయ న‌టుడిగా హీరోగా నిర్మాతగా రాజ‌కీయ నాయ‌కుడిగా ఎన్నో విద్యా సంస్థ‌ల అధినేత‌గా ప్ర‌తిభావంతుడిగా మోహ‌న్ బాబుకు అభిమానులు ఉన్నారు. ఆయ‌న త‌న గ‌తం గురించి ఎప్పుడు మరిచిపోను అని ఓ సంద‌ర్భంలో ఎంతో ఎమోష‌న‌ల్ అయ్యారు. ``గతాన్ని నెమరువేసుకుంటే తెలియని దుఃఖం వస్తుంది. నేను ఎంత రఫ్ గా కనిపిస్తానో అంతకంటే చాలా సున్నితం ఏదీ తట్టుకోలేను`` అంటూ ఎమోషనల్ అయ్యారు. ఇప్పుడు మ‌రోసారి అలాంటి ఎమోష‌న్ ఆయ‌నలో బ‌య‌ట‌ప‌డింది. ఇలాంటి క‌ష్టం నా ప‌గోడికైనా రాకూడ‌ద‌ని ఆయ‌న ఆవేద‌న చెందారు. త‌న సినీకెరీర్ లో ఎదురైన క‌ష్ట న‌ష్టాల‌ను గుర్తు చేసుకున్నారు ఎంబీ. సినిమాల కోసం ఇల్లు కూడా అమ్ముకున్నాన‌ని .. త‌న‌ని క‌ష్ట కాలంలో ఆదుకునేందుకు ఎవ‌రూ ముందుకు రాలేద‌ని మోహ‌న్ బాబు ఇంత‌కుముందు ఆవేద‌న చెందారు. తాను న‌టించిన స‌న్నాఫ్ ఇండియా- జిన్నా చిత్రాలు ఫెయిల‌య్యాయ‌ని నాటి ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించారు. సినీప‌రిశ్ర‌మ‌ను న‌డిపించేది సక్సెస్ ఒక్క‌టే. అది లేకుంటే ఎదుర‌య్యే స‌మ‌స్య‌లను ఎంబీ ఎలాంటి భేష‌జానికి పోకుండా ప్ర‌స్థావించారు. ముక్కు సూటిగా ఉన్న‌ది ఉన్న‌ట్టు మాట్లాడే మోహ‌న్ బాబుకు అందుకే అభిమానులున్నారు. ప్ర‌స్తుతం త‌న‌యుడు మంచు విష్ణు ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తూ నిర్మిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం `భ‌క్త క‌న్న‌ప్ప‌`లో మోహ‌న్ బాబు ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. ప‌రిశ్ర‌మ‌లో జ‌యాప‌జ‌యాల‌ను లెక్క చేయ‌క విజ‌యంకోసం పాకులాడకుండా చేసే పనిలో నిబద్ధత భావం ఉండాలి అని చెప్పడం ఒక మోహన్ బాబు గారికి మాత్రమే చెలుతుంది మరి .ఎంత గొప్ప వ్య‌క్తి అయినా కెరీర్ ప‌రంగా ఎత్తు ప‌ల్లాలు ఉంటాయి. అన్నిటినీ అధిగ‌మించి నేడు ఒక స‌మున్న‌త స్థానానికి ఎదిగారు. నేటి (19 మార్చి)తో 72వ వ‌సంతంలోకి అడుగుపెట్టిన‌ మోహ‌న్ బాబు బ‌ర్త్ డే సంద‌ర్భంగా హ్యాపీ బ‌ర్త్ డే టు ఎంబి.





Untitled Document
Advertisements