ఏడాది పాటు సినిమాలు లేకుండా సోషల్ మీడియాలో గడిపేసిన బుట్టబోమ్మకు అవకాశాలు

     Written by : smtv Desk | Wed, Mar 20, 2024, 02:59 PM

ఏడాది పాటు సినిమాలు లేకుండా సోషల్ మీడియాలో గడిపేసిన బుట్టబోమ్మకు అవకాశాలు

పూజా హెగ్డే ఒక భారతీయ మోడల్, నటిమాత్రమే కాదు , పూజ 2010 లో విశ్వసుందరి పోటీలకు భారతదేశం నుంచి ఎంపిక కోసం జరిగిన అందాల పోటీల్లో రెండో స్థానం లో నిలిచింది. ఈ పొడుగు కాళ్ళ సుందరి తన అందంతో అబినయం వలన 2012 లో తమిళ సూపర్ హీరో సినిమా ముగమూడి అనే సినిమాలో అవకాశం వచ్చింది ఈమె 2014 లో ముకుంద సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయింది. తరువాత ఒక లైలా కోసం సినిమాలో నటించింది. ఆ తర్వాత వరుస ఛాన్సులు దక్కించుకుంటూ స్టార్ హీరోల సరసన ఆడిపాడింది. తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. చాలా మంది హీరోయిన్ల లాగానే టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కు షిఫ్ట్ అయింది. అప్పటికే ఓ హిందీ సినిమా చేసిన ఈ బ్యూటీ అక్కడ అవకాశాలు అందుకుంది. కానీ ఆమె నటించిన రెండు చిత్రాలు వరుసగా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయ్యాయి. తెలుగులో రాధేశ్యామ్, ఆచార్య కూడా డిజాస్టర్లు అయ్యాయి. మహేష్ బాబు గుంటూరు కారం, పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ లో ఆఫర్లు వచ్చినా రిజెక్ట్ చేసింది. బాలీవుడ్ లో తెగ అవకాశాలు వచ్చేస్తాయని, డేట్స్ అడ్జెస్ట్ చేయలేమోనని భయపడి ఆ రెండు చిత్రాలను పూజ వదలిసేందని అప్పుడు సినీ వర్గాల్లో టాక్ వినిపించింది.
అయితే సల్మాన్ ఖాన్ తో పూజా హెగ్డే నటించిన కిసీ కా భాయ్ కిసీ కా జాన్ మూవీ ఫ్లాప్ అయింది. ఆ తర్వాత అటు బాలీవుడ్ లో ఇటు టాలీవుడ్ లో ఒక్క ఛాన్స్ కూడా రాలేదు. చివరకు వెబ్ సిరీస్ చేద్దామని కూడా ఫిక్స్ అయిందని వార్తలు వచ్చాయి. చేతిలో ఒక్క సినిమా కూడా లేకుండానే ఇయర్ అంతా గడిపేసింది. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంది. తన ఫ్యాన్స్ తో డైలీ టచ్ లో ఉంటోంది . ఒకసారి ఫుల్ ట్రెడిషనల్ గా మరోసారి హీట్ పుట్టించేలా ఔట్ ఫిట్స్ లో సందడి చేస్తుంటోంది పూజ. రకరకాల పోజులిస్తూ కుర్రకారును కవ్విస్తుంటోంది. ఘాటు అందాలతో మతి పోగుడుతుంటోంది. ఎవర్ గ్రీన్ బ్యూటీగా ఫాలోవర్స్ ను పెంచుకుంటోంది. డైలీ తన సోషల్ మీడియా వాల్ కచ్చితంగా చూడాలనిపించేలా పోస్టులు పెడుతుంటోంది. నెట్టింట ఎప్పుడూ ట్రెండింగ్ లోనే ఉంటోంది ఈ బుట్టబొమ్మ.

తాజాగా తన ఇన్ స్టా స్టోరీలో రకరకాల పోజుల ఉన్న వీడియో షేర్ చేసింది . ప్రస్తుతంఈ బుట్టబొమ్మ నయా పిక్స్ తోపాటు వీడియోను నెటిజన్లు తెగ షేర్ చేస్తున్నారు. ఇంతకంటే హీటెక్కించే లుక్ మరొకటి ఉంటుందా అంటూ సందడి చేస్తున్నారు. ప్రస్తుతం మళ్లీ బాలీవుడ్ తోపాటు టాలీవుడ్ లో అవకాశాలు అందుకుంటూ బిజీగా మారుతున్న ఈ అమ్మాడు వచ్చే సినిమాలలో తన నటనతో ప్రేక్షేకులను ఎలా మేపింస్తుందో చూడాలి మరి .





Untitled Document
Advertisements