వందతో మొద‌లైన ప్ర‌యాణం నేడు కోట్ల‌కు చేరుకుంది.. సుహాస్

     Written by : smtv Desk | Wed, Mar 20, 2024, 04:05 PM

వందతో మొద‌లైన ప్ర‌యాణం నేడు కోట్ల‌కు చేరుకుంది.. సుహాస్

ఇండ‌స్ట్రీలో బ్యాక్ గ్రౌండ్ సపోర్ట్ లేకుండా వచ్చి వివిధ శాఖ‌ల్లో ఎదిగిన వారెంతో మంది ఉన్నారు. ప‌రిశ్ర‌మకి ఎప్పుడు కొత్త నీరు అలా వ‌స్తూనే ఉంటుంది.అలాంటి కోణంలో ఇటీవ‌లి కాలంలో స‌క్సెస్ అయిన న‌టుడి గురించి చెప్పుకోవాలంటే సుహాస్ ఒకరు .మొదటగా కలర్ ఫోటో చిత్రానికి సినీ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. హీరోగా సుహాస్‏కు ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టింది.ఆ సినిమా జాతీయ అవార్డ్ అందుకుంది. సుహాస్‌ కు ‘హిట్2’ చిత్రంలో చేసిన విలన్ రోల్‌‌ కూడా మంచి పేరు తీసుకొచ్చింది. ఇప్పుడు హీరోగా రెండో ప్రయత్నం రైటర్ పద్మభూషణ్ తో చేశాడు. ఈ సినిమా సూపర్ హిట్ అందుకుంటోంది.అన్ని కష్టాలు పడి ఇండ‌స్ట్రీలో వంద రూపాయ‌ల‌తో ప్ర‌యాణం మొద‌లు పెట్టి నేడు కోట్ల‌కు ప‌డ‌గెత్తాడు. తొలుత లైట్ బోయ్ గా చేరాడు. అటుపై డైర‌క్ష‌న్ డిపార్ట్ మెంట్ ఇలా ర‌క‌ర‌కాల శాఖ‌ల్లో ప‌నిచేసి ప‌రిచ‌యాలు పెంచుకున్నాడు. అటుపై ప్ర‌తిభ‌ను నిరూపించుకేనే వ‌కాశం వ‌చ్చింది. ప‌డి ప‌డి లేచే మ‌న‌సుతో తొలిసారి మ్యాక‌ప్ వేసుకున్నాడు. అటుపై `మ‌జిలి` లో స‌రైన రోల్ ప‌డింది. ఆ త‌ర్వాత `డియ‌ర్ కామ్రేడ్`...`ప్ర‌తి రోజు పండ‌గే` లాంటి సినిమాల్లో న‌టించాడు. స‌రిగ్గా ఇదే స‌మ‌యంలో `క‌ల‌ర్ ఫోటో` అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అదే ఐడెంటీ కొత్త అవ‌కాశాలు సృష్టించింది. అప్ప‌టివ‌ర‌కూ చిన్న పాత్ర‌లు చేసే సుహాస్ కి అప్ప‌టి నుంచి పాత్ర‌ల ఫ‌రిది పెరిగింది.
ఈ ఏడాదిలో అత‌ని సినిమాల సంఖ్య పెరిగింది. ఇక` అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్` తో హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యాడు. ప్ర‌స్తుతం అత‌డి చేతిలో నాలుగైదు సినిమాలున్నాయి. వాటిలో కొన్ని షూటింగ్ పూర్తిచేసుకుని రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. కేబుల్ రెడ్డి..శ్రీరంగ నీతులు..ప్ర‌స‌న్న వ‌ద‌నం.. ఆనంద‌రావు అడ్వెంచ‌ర్స్.. గొర్రె పురాణం ఇలా కొన్ని సినిమాల్లో సుహాస్ లీడ్ రోల్ పోషిస్తున్నాడు. ఈ సినిమా విజ‌యాలు అత‌డి కెరీర్ ని నిర్దేశించే అవ‌కాశం ఉంది.అందుకు అదృష్టం కూడా క‌లిసి రావాల‌నుకోండి. ఎంతో మంది ప్ర‌తిభావంతులున్నా అవ‌కాశం రావ‌డం అన్న‌ది అస‌లైన విజ‌యము .





Untitled Document
Advertisements