పెసరపప్పుతో రసగుల్ల సింపుల్ స్వీట్ వెంటనే మీరు కూడా ట్రై చేయండి

     Written by : smtv Desk | Mon, Mar 25, 2024, 10:31 AM

పెసరపప్పుతో రసగుల్ల సింపుల్ స్వీట్ వెంటనే మీరు కూడా ట్రై చేయండి

మనలో చాల మందికి స్వీట్స్ అంటే చాల ఇష్టం ఉంటుంది కానీ తినడానికి బయపడతారు . అయితే మంచి పోషక విలువలు కలిగినటువంటి మూంగ్ దాల్ తో స్వీట్స్ చేసుకోవచ్చును . అవి చాల రుచిగా ఉంటాయి . గులాబ్ జామూన్‌లు, రసగుల్లాలు చూస్తేనే నోరూరిపోతాయి. అవి మెత్తగా, జ్యూసీగా ఉంటాయి. అలాంటి కోవకే చెందుతుంది మూంగ్ దాల్ రసగుల్లా కూడా. ఇది నోట్లో పెట్టగానే కరిగిపోయేటట్టు ఉంటుంది. పిల్లలకు, పెద్దలకు చాలా నచ్చుతుంది. దీనిలో పెసరపప్పు, పనీర్ ఎక్కువగా వాడతాము. ఇది డిజర్ట్ కోవలోకే వస్తుంది. హోలీ, దీపావళి వంటి పండగలు వచ్చినప్పుడు ఈ పెసరపప్పు రసగుల్లాను ఒకసారి ప్రయత్నించండి. జ్యూసీగా, టేస్టీగా ఉంటుంది.


పెసరపప్పు రసగుల్లా రెసిపీకి కావలసిన పదార్థాలు:
పెసరపప్పు - అర కప్పు
పనీర్ - 100 గ్రాములు
యాలకులు - రెండు
కుంకుమ పువ్వు రేకులు - 4
చక్కెర - ఒక కప్పు
వెజిటబుల్ ఆయిల్ - ఒక కప్పు

పెసరపప్పు రసగుల్లా తయారీ విధానము :
పెసరపప్పును నాలుగైదు సార్లు శుభ్రంగా కడిగి వేడి నీటిలో గంట పాటు నానబెట్టాలి.
ఇప్పుడు నీళ్ళను వడకట్టి పప్పును మిక్సీలో వేసి మెత్తగా రుబ్బి పేస్ట్ చేయాలి.
అందులోనే పనీర్ ముక్కలు, రెండు టేబుల్ స్పూన్ల నీరు వేసి మళ్లీ మిక్సీ పట్టుకోవాలి.
ఆ మొత్తం మిశ్రమాన్ని తీసి ఒక గిన్నెలో వేసుకోవాలి.
ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి ఒక కప్పు చక్కెర, ఒక కప్పు నీరు వేసి చిన్న మంట మీద ఉడికించాలి.
చక్కెర పూర్తిగా కలిసిపోయాక యాలకుల పొడిని వేసి కలుపుకోవాలి.
అలాగే కుంకుమ పువ్వు రేకులను కూడా వేసి కలపాలి.
ఈ సిరప్ కాస్త చిక్కగా అయ్యేంతవరకు ఉంచుకోవాలి.
ఇప్పుడు గిన్నెలో వేసుకున్న పెసరపప్పు మిశ్రమాన్ని విస్కర్ తో ఒకసారి బాగా గిల కొట్టాలి. అది మరింత మెత్తగా అవుతుంది.
ఇప్పుడు స్టవ్ మీద మరో కడాయి పెట్టి నూనె వేయాలి.
పెసరపప్పు మిశ్రమాన్ని రౌండ్ గా ఉండల్లా చుట్టి ఆ నూనెలో వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి.
తర్వాత వాటిని తీసి చక్కెర సిరప్‌లో వేయాలి.
చక్కెర సిరప్‌లో అరగంట పాటు వదిలేయాలి.
గులాబ్ జామూన్‌లాగే ఇవి చక్కెర సిరప్‌ను పీల్చుకొని మెత్తగా మారుతాయి. నోట్లో పెట్టగానే కరిగిపోయేలా ఉంటాయి.
పెసరపప్పు, పనీ ర్ రెండు ఆరోగ్యానికి మంచివే. ఎప్పుడు గులాబ్ జామూన్, రసగుల్లా తినేవారికి ఈ పెసరపప్పు రసగుల్లా చాలా నచ్చుతుంది. ఒక్కసారి దీన్ని చేసుకొని చూడండి. పిల్లలు, పెద్దలు ఇది మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతారు. పండుగలు, వేడుకల సమయంలో ఇంట్లో వీటిని చాలా సులువుగా చేసుకోవచ్చు . ఈ సమ్మర్ హాలిడేస్ కి పిల్లలకి డైలీ ఒక స్నాక్ గా చేసి పెట్టవచ్చు .





Untitled Document
Advertisements