సింపుల్ అండ్ యూనిక్ డ్రెస్సింగ్ టిప్స్ ఫర్ ఆఫీస్

     Written by : smtv Desk | Mon, Mar 25, 2024, 10:51 AM

సింపుల్ అండ్ యూనిక్ డ్రెస్సింగ్ టిప్స్ ఫర్ ఆఫీస్

మనంఏ ఫంక్షన్ కి వెళ్లిన మరే ఎక్కడకి వెళ్ళినా కూడా మనకంటూ ఒక ప్రత్యేకత కోసం చూస్తాము . అందుకోసం డ్రెస్సింగ్ హెల్ప్ చేస్తుంది. ఫంక్షన్ లో అయితే పట్టు సారీస్ డిఫరెంట్ గా కనబడడానికి కట్టుకుంటాము . అయితే మరి ఆఫీస్‌కి వెళ్ళినప్పుడు ఎలాంటి డ్రెస్సింగ్ ఉండాలో ఇప్పుడు చూద్దాం.

ఏ అకేషన్‌కైనా డ్రెస్సింగ్ కీ రోల్ పోషిస్తుంది. ఇందులో భాగంగా ఇప్పుడు ఆఫీస్‌కి వెళ్ళేటప్పుడు సింపుల్‌గా, యూనిక్‌గా కనిపించాలంటే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. అప్పుడే ఆ మేకప్ ఎబ్బెట్టుగా కాకుండా అందంగా కనిపిస్తుంది . మనం డ్రెస్సింగ్ ఎంచుకునేటప్పుడు మంచి కలర్స్ ఎంచుకోవాలి. అవి కూడా ఎక్కువగా బ్లూకలర్, వైట్ కలర్ వంటి గుడ్ కాంబినేషన్‌తో మీరు ఎంచుకున్న జీన్స్ బ్లూ కలర్‌లో ఉంటే షర్ట్ వైట్ కలర్‌లో ఉండాలి.అంతేకాకుండా కలర్ తో పాటు మంచి క్వాలిటీ కూడా చూసుకోవాలి . కొంతమంది బట్టలు కొట్టరు. వాటి క్వాలిటీ గురించి పట్టించుకోరు. మంచి క్వాలిటీ ఐటెమ్స్ తీసుకుంటే కలర్ పోవడం, చిరగడం వంటి సమస్యలు ఉండవు. అదే విధంగా, ఇవి మంచి లుక్‌ని అందిస్తాయి.కొన్నిసార్లు ఎంత మంచి క్లాత్‌తో కుట్టినా సరిగ్గా కుట్టకపోతే అది లుక్ ఉండదు. అదే సరైన విధంగా కుడితే అది మీకు మంచి లుక్‌ని అందిస్తుంది.అదే విధంగా, మీరు ఆఫీస్‌కి వెళ్ళేటప్పుడు ఎక్కువ ఆర్నమెంట్స్ కాకుండా వాచెస్, కొన్ని ఆర్నమెంట్స్ వేసుకోవచ్చు. ఇవి తక్కువ బరువు ఉంటే మంచిది. అదే విధంగా హెయిర్ స్టైల్ కూడా సింపుల్ అండ్ నీట్‌గా ఉంటే బావుంటుంది.అదే విధంగా, మీ డ్రెస్‌కి సరిపోయే షూ ఎంచుకోండి. సరైన కలర్‌వి ఎంచుకోండి. దీని వల్ల మీరు చాల డీసెంట్ ఉన్నట్లు కనబడతారు మీరు ఎంత మంచిగా కనబడితే అంత రేస్ పెక్ట్ పెరుగుతుంది .






Untitled Document
Advertisements