ఆడవారిలో వైట్ డిశ్చార్జ్ సమస్యకు మెంతులతో చెక్..

     Written by : smtv Desk | Tue, Mar 26, 2024, 10:38 AM

ఆడవారిలో వైట్ డిశ్చార్జ్ సమస్యకు మెంతులతో చెక్..

ఆడవారికి ఎన్నో రకాలైన సమస్యలు వస్తూ ఉంటాయి. వాటిని బయటికి చెప్పడానికి ఇబ్బంది పడుతుంటారు. దీనిలో ముఖ్యమైనది వైట్ డిశ్చార్జ్ సమస్య. దీని వల్ల ఆడవారిలో మరికొన్ని ఇతర సమస్యలు కూడా వస్తూ ఉంటాయి . అవి అలసట, నీరసం. చికాకు . వంటివి ఉంటాయి . వీటిని ముందుగా గుర్తించి ట్రీట్‌మెంట్ తీసుకోకపోతే ఇన్ఫెక్షన్ పెరుగుతుంది. వైట్ డిశ్చార్జ్‌లోనూ రకాలు ఉంటాయి. మామూలుగా డిశ్చార్జ్ రంగుని బట్టి సమస్యని తీవ్రతని పరిగణించొచ్చు. అసలు ఈ సమస్య ఎందుకొస్తుంది. దీనిని తగ్గించడానికి ఎలాంటి ఇంటి చిట్కాలు ఫాలో అవ్వాలో తెలుసుకోండి.

మొదటగా ఇది రావడానికి కారణాలు తెలుసుకుందాం :
యోని ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచుకోకపోవడం వల్ల సమస్య వస్తుంది.అంతేకాకుండా పోషకాల లోపం కారణంగా కూడా ఈ సమస్య వస్తుంది.షుగర్ పేషెంట్స్ లో కూడా ఎక్కువగా కనబడుతుంది .

లక్షణాలు:
విపరీతమైన నీరసం, తల తిరగడం, యోని ప్రాంతంలో దురద, బలహీనత, ప్రైవేట్ పార్ట్స్ నుండి వాసన, తలనొప్పి, మలబద్ధకం వంటి సమస్యలొస్తాయి
కొన్నిసార్లు వైట్ డిశ్చార్జ్ అనేది మంచిదే. ఎందుకంటే యోనిలో బ్యాక్టీరియా, ఫంగల్ పెరుగుదలని తగ్గిస్తుంది. లైంగిక సంపర్క సమయంలో లూబ్రికేషన్‌లా పనిచేస్తుంది.


తులసి..
తులసిని అనేక సమస్యలకి పరిష్కారంగా తీసుకోవచ్చు. తులసి ఆకులని శుభ్రం చేసి నీటితో కలిపి గ్రైండ్ చేసి అందులో కొద్దిగా తేనె కలిపి వారానికి రెండు సార్లు తాగండి. లేదంటే పాలలో తులసి ఆకులని వేసుకుని తాగొచ్చు.

రాతి ఉసిరి..
ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. దీనిని తినడం వల్ల మన శరీరానికి పోషకాలు పుష్కలంగా అందుతాయి. ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది.అందుకోసం మీరు ఉసిరిని పచ్చిగా, పొడి రూపంలో తినొచ్చు. లేదా క్యాండీల్లా తయారు చేసి తినండి. రెగ్యులర్‌గా తింటే సమస్య పరిష్కారమవుతుంది.

ధనియాలు..
మనకు తెలియకుండానే వంట ఇంట్లో వాడే ధనియాలను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని వడగట్టి పరగడపున తాగితే చాలా తేలిగ్గా సమస్య నుంచి బయటపడొచ్చు.

మెంతులు..
ఈ సమస్య తగ్గేందుకు మెంతులని నీటిలో వేసి మరిగించి తాగితే ఈ సమస్య తగ్గుతుంది.అందుకోసం అరలీటరు నీటిలో మెంతులని వేసి అవి సగం అయ్యేవరకూ మరిగించి చల్లారక ఆ నీటిని తాగండి.

జామాకులు..
అదే విధంగా, జామాకుల్ని తీసుకుని వాటిని శుభ్రంగా కడగాలి. తర్వాత వాటిని నీటిలో మరిగించి చల్లారక రోజుకి రెండుసార్లు తాగండి . ఇలా చేయడం వలన ఈ సమస్యనుండి తొందరగా ఉపశమనం పొందవచ్చును . ఒకవేళ ఇలా చేయడము తో కూడా మీ సమస్య తగ్గపోతే గ్యానకాలజిస్ట్ డాక్టర్ ని సంప్రదించాలి . అంతే కానీ ఏమి కాదు అని వదిలివేయకూడదు .









Untitled Document
Advertisements