ఈ మెడిసిన్ తో బాడీలో యూరిక్ యాసిడ్ లెవల్స్‌ని తగ్గించుకోవచ్చు

     Written by : smtv Desk | Tue, Mar 26, 2024, 10:56 AM

ఈ మెడిసిన్ తో బాడీలో యూరిక్ యాసిడ్ లెవల్స్‌ని  తగ్గించుకోవచ్చు

ఈ మధ్య కాలంలో మారిపోతున్న ఆహారపు అలవాట్ల వలన , మారుతున్న జీవన శైలీ వలన , చాల మంది మగవారికి అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి . అందులో ఒకటి కిడ్నీ స్టోన్స్ . దీనికి కారణం ఏమైనా కావచ్చును . మగవారిలో యూరిక్ యాసిడ్ పెరిగితే. శరీరంలో బయటికి వెళ్ళాల్సిన వ్యర్థాలు అలానే ఉండిపోవడం వల్ల చేతులు, కాళ్ళలో నీరు చేరి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. సాధారణంగా ఆడవారికంటే మగవారికే యూరిక్ యాసిడ్ సమస్య ఎక్కువగా ఉందని అంటారు. దీని కారణంగా కిడ్నీల్లో రాళ్ళు ఏర్పడతాయి. ఈ సమస్యని తగ్గించుకోవడానికి ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ను తీసుకుంటే తగ్గించుకోవచ్చు. అవి ఏంటో చూదాం .

వేప రసం :

రక్తాన్ని శుద్ధి చేయడంలో వేపరసం ముందుంటుంది. అందుకే, దీనిని మంచి డీటాక్సిఫైయర్ అని చెప్పొచ్చు. దీనిని తీసుకుంటే రక్తం శుభ్రమవుతుంది. దీంతో పాటు ట్యాక్సిన్స్ తొలగిపోయి యూరిక్ యాసిడ్ తగ్గుతుంది. ఈ కారణంగా సంబంధిత సమస్యలు కూడా తగ్గుతాయి.

బ్రహ్మి :
నాడీ వ్యవస్థని ప్రశాంతంగా ఉంచి శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించడంలో బ్రహ్మి చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. దీనిని తీసుకోవడం వల్ల బాడీలోని అదనపు యూరిక్ యాసిడ్ బయటికి వెళ్ళి జీవక్రియ ప్రక్రియ వేగవంతమవుతుంది.

అశ్వగంధ:
అశ్వగంధలోనూ మానసిక ఒత్తిడిని తగ్గించి, ఇమ్యూనిటీని పెంచే గుణం ఉంది. దీనిని తీసుకోవడం వల్ల అదనపు యూరిక్ యాసిడ్ తగ్గుతుంది. అందుకోసం రోజూ అశ్వగంధ టీ తాగితే మంటని తగ్గించుకోవచ్చు.ఇది కూడా మంచి మూత్ర విసర్జ మూలిక. మూత్రం ద్వారా శరీరం నుండి అదనపు యూరిక్ యాసిడ్‌ని బయటికి పంపుతుంది. దీని వల్ల శరీరంలో నీరు నిలిచిపోవడాన్ని తగ్గిస్తుంది. ఇది కిడ్నీ ఆరోగ్యంతో పాటు, గుండె ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. దీంతో పాటు మగవారిలో ఎలివేటెడ్ యూరిక్ యాసిడ్‌ని తగ్గిస్తుంది.అంతేకాకుండా షుగర్ తో బాధపడే వారికీ కూడా షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ లో ఉంచుతాయి . మన పూర్వ కాలం నుండి కూడా ఆయుర్వేదం అమలులో ఉంది వీటిని ఉపయోగించుకొని ఎన్నో రోగాలకు మందులు వాడారు .






Untitled Document
Advertisements