తిరుమల శ్రీవారి భక్తులకు ఆన్ లైన్ బుకింగ్ అలర్ట్.. టీటీడీ కీలక ప్రకటన

     Written by : smtv Desk | Sat, Mar 30, 2024, 11:08 AM

తిరుమల శ్రీవారి భక్తులకు ఆన్ లైన్ బుకింగ్ అలర్ట్.. టీటీడీ కీలక ప్రకటన

వేసవి కాలం మూడు రోజులు సెలవు రావడంతో చాల మంది కలియుగ దేవుడు అయినా వేంకటేశ్వరస్వామిని దర్శనం చేసుకోవడానికి వెళ్తుంటారు . కానీ ఇవి వరుసగా సెలవు రోజులు కావడం వలన అక్కడ దర్శనానికి ఇబ్బంది పడతారు . కావున అన్ని టికెట్స్ బుక్ చేసుకొని వెళ్లడం చాల సులభమైన పద్దతి .
తిరుమలలో జరిగే కల్యాణము ఘనంగా జరుగనుంది. దీనికి విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేపట్టింది.అలాగే పాప‌వినాశ‌నం డ్యామ్ వ‌ద్ద భక్తులకు అల్పాహారం, అన్న‌ప్ర‌సాదాలు, త్రాగునీరు అందిస్తారు. ప్ర‌థ‌మ చికిత్స కేంద్రాలు, అంబులెన్సులు, మందులు, పారామెడికల్ సిబ్బంది అందుబాటులో ఉంచనున్నారు.


తీర్థానికి ఎక్కువ దూరం నడవాల్సింది వస్తుంది. కావున గుండె, శ్వాస కోస సమస్యలు, స్థూలకాయం ఉన్నవారికి అనుమతి లేదు. అందువల్ల ఇలాంటి భక్తులు ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. వీరికి అనుమతి ఉండదు. అలాగే భ‌క్తులు వంట సామగ్రి, క‌ర్పూరం, అగ్గిపెట్టెలు తీసుకురాకూడదని టిటిడి విజ్ఞప్తి చేస్తోంది.

పోలీసుశాఖ, అటవీశాఖ, టిటిడి విజిలెన్స్ విభాగం సమన్వయంతో పాపవినాశనం నుండి తుంబురు తీర్థం వరకు అక్కడక్కడ భద్రతా సిబ్బందిని వుంచి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టనున్నారు.

ప్రకృతి సౌందర్యాల నడుమ నిర్వహించే తుంబురు తీర్థ ముక్కోటిని దర్శించి, స్నానమాచరించడం ఒక ప్రత్యేక అనుభూతిగా భావిస్తారు. ఈ ముక్కోటిలో టిటిడి అధికారులు, అర్చకులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొంటారు.

జూన్-2024 నెలలో తిరుమల మరియు తిరుపతికి జనరల్ శ్రీవారి సేవ యొక్క ఆన్‌లైన్ కోటా 27.03.2024న ఉదయం 11 గంటలకు, నవనీత సేవ మధ్యాహ్నం 12 గంటలకు మరియు పరకామణి సేవ తిరుమల కోసం మధ్యాహ్నం 1 గంటలకు విడుదల చేయబడుతుంది. ఎలక్ట్రానిక్ డిప్ సిస్టమ్ ద్వారానే శ్రీవారి సేవకులకు ఆలయ విధులు కేటాయిస్తున్నారు. ప్రతి బృందం ఆలయ విధులను పొందడం తప్పనిసరి కాదు. ప్రతినెలా పౌర్ణమి పర్వదినాన టీటీడీ గరుడ సేవ నిర్వహిస్తున్న విషయం విదితమే. ఇందులో భాగంగా రాత్రి 7 నుండి 9 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై తిరుమాడ వీధులలో ఊరేగి భక్తులకు దర్శనమిస్తారు.ఆన్ లైన్ కోట లో టికెట్ బుక్ చేసుకునే వెసులుబాటు ఉండడం వలన ముందుగానే టికెట్స్ బుక్ చేసుకొని వెళ్లవలెను . ఆలాగైతేనే చిన్న పిల్లలకు , ముసలి వారికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది





Untitled Document
Advertisements