కంది పప్పు బూస్ట్ కంటే బలమైనది.. అతిగా తింటే ఏమౌంతుదో చూడండి

     Written by : smtv Desk | Sat, Mar 30, 2024, 12:38 PM

కంది పప్పు బూస్ట్ కంటే బలమైనది.. అతిగా తింటే ఏమౌంతుదో చూడండి

శాకాహారులకు ఎక్కువగా ప్రోటీన్స్ ఇచ్చేవి పప్పులు . అలన్తి పప్పులతో చాల రకాలు ఉంటాయి . అయితే వీటిలో ఎర్ర కంది పప్పు (మసూర్ దాల్) అని పిలిచే ఈ పప్పు ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేస్తుంది. ఇందులో ప్రొటీన్, ఫైబర్, ఫోలెట్, ఐరన్ సమృద్ధిగా ఉంటాయి. బరువు తగ్గే ప్రయత్నాల్లో ఉన్నవారు ఎర్ర కంది పప్పును డైట్‌లో చేర్చుకోవచ్చు. షుగర్‌ లెవల్స్‌ని కంట్రోల్‌ చేస్తుంది, రోగనిరోధక శక్తి పెంచుతుంది. రక్తహీనత నివారణ, గుండె, చర్మం, ఎముకల ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. ఇన్ని పోషకాలున్నాయని మరి ఎక్కువగా ఈ ఎర్ర కంది పప్పు తింటే పొరపాటు. దీని వలన అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి . అవి ఏంటో తెలుసుకుందాము .
ఈ ఎర్ర కంది పప్పు వినియోగించడం వల్ల కొందరిలో అలెర్జీ సమస్యలు కలగవచ్చు. చర్మంపై దురద, ఇన్‌ఫ్లమేషన్, జీర్ణశయ సమస్యలు వంటివి ఏర్పడవచ్చు.బ్యాలెన్స్‌డ్ డైట్ అనుసరించకుండా మసూర్ దాల్‌ని అధికంగా తీసుకుంటే శరీరంలో పోషకాల సమత్యులత దెబ్బతింటుంది. ఇది అనేక రోగాలకు దారితీయవచ్చు.కొంత మంది యూరిన్ సమస్య తో బాధ పడే వారు ఈ ఎర్ర కందిపప్పు తినకపోవడమే మంచిది. ఇందులో ప్యూరిన్ అనే కాంపౌండ్‌ అధికంగా ఉంటుంది. ఇది యూరిక్ యాసిడ్ లెవల్స్‌ను పెంచుతుంది. ఫలితంగా కీళ్ల నొప్పుల సమస్యకు దారితీయవచ్చు.అదే విధంగా కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఎర్ర కంది పప్పు ఆహారంగా తీసుకోకూడదు. ఈ పప్పులో ఆక్సలేట్స్ అధికంగా ఉంటాయి. ఇవి కిడ్నీలో రాళ్లు ఏర్పడడానికి, ఇతర కిడ్నీ రోగాలకు కారణమవుతాయి. అందుకే కిడ్నీ రోగులు ఆహారంలో మసూర్ దాల్‌ చేర్చుకోకపోవడం బెటర్.


ఎర్ర కంది పప్పు అధికంగా వినియోగిస్తే అందులోని ఫైబర్ కొన్నిసార్లు గ్యాస్ సమస్యలకు దారితీయవచ్చు. అలాగే ఎసిడిటీ సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంటుంది. మసూర్ పప్పులో ప్రొటీన్ కంటెంట్ కూడా అధికంగా లభిస్తుంది. ఇది శరీరంలో కొవ్వు పేరుకుపోయి అధిక బరువుకు దారితీయవచ్చు.మసూర్ పుప్పును తగిన పరిమాణంలో వినియోగిస్తే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఇందులో ఉండే ప్రొటీన్ కండరాలను బలోపేతం చేస్తుంది. నాడీ వ్యవస్థ, మెదడు పనితీరును మెరుగుపరిచే ఖనిజాలు ఎర్ర కందిపప్పులో ఉంటాయి. మసూర్ దాల్ తినడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ (LDL) లెవెల్స్ తగ్గుతాయి. గుండె, ధమనులు ఆరోగ్యం మెరుగుపడుతుంది. స్ట్రోక్ రిస్క్ తగ్గుతుంది. ఎర్ర కంది పప్పు తింటే చర్మం, జుట్టు ఆరోగ్యం బాగుపడుతుంది.

ఇందులోని విటమిన్లు, ఖనిజాలు చర్మ నిగారింపును పెంచుతాయి. విటమిన్లు పుష్కలంగా ఉండే ఈ ఎర్ర కందిపప్పుముఖంపై ముడతలు, గీతలు, వృద్ధాప్య ఛాయలు రాకుండా దూరం చేస్తుంది.ఈ పప్పు ను మిక్స్ కి వేసి పొడిలాగా చేసుకొని దానిలో కొంచం పెరుగు కలుపుకొని ముఖానికి పెట్టుకోవడం వలన మంచి స్క్రబ్బింగ్‌, చర్మానికి క్లెన్సర్‌గా పని చేస్తుంది. చర్మంలోని మురికిని సులువుగా బయటకు పంపుతుంది.





Untitled Document
Advertisements