బీట్రూట్ తో ఆరోగ్యకరమైన బ్రేక్ ఫాస్ట్ రెసిపీ

     Written by : smtv Desk | Mon, Apr 01, 2024, 09:35 AM

బీట్రూట్ తో ఆరోగ్యకరమైన బ్రేక్ ఫాస్ట్ రెసిపీ

మన రోజు వారి ఆహారంలో కూరగాయలు చాల ముఖ్యం . అందులో దుంప్ప రకానికి చెందిన బీట్రూట్ తినడం వలన మనకు కావలసిన హిమోగ్లోబిన్ అనేది లభింస్తుంది . ఇందులో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి. అయితే చాల మంది బీట్రూట్ కర్రీ తినడానికి ఇష్టపడరు కావున వీటితో అనేక రకాలైన పదార్థాలను చేసుకోవచ్చు . టిఫిన్ లోకి దోస మాదిరిగా , ఇడ్లీ మాదిరిగా చేసుకోవచ్చును . ఈ ఇడ్లీలు పిల్లలు కూడా తినడానికి బాగా ఇష్ట పడతారు . పిల్లలకు బీట్రూట్ ఇడ్లీ తినిపించడం వల్ల ఎన్నో పోషకాలను అందించిన వారు అవుతారు. వీటిని చేయడం కూడా చాలా సులువు. బీట్రూట్ ఇడ్లీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.

బీట్రూట్ ఇడ్లీ రెసిపీకి కావాల్సిన పదార్థాలు

బియ్యం - రెండు కప్పులు

మినప్పప్పు - ఒక కప్పు

బీట్రూట్ - ఒకటి

నెయ్యి - ఒక స్పూను

ఉప్పు - రుచికి సరిపడా

బీట్రూట్ ఇడ్లీ తయారీ విధానం :

1ముందుగా బియ్యాన్ని, మినప్పప్పును విడివిడిగా కడిగి ఆరు గంటల పాటు నానబెట్టండి.

2. అవి బాగా నానాక మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోండి.

3. ఇప్పుడు ఈ రెండింటినీ ఒకే గిన్నెలో వేసి రాత్రంతా పులియబెట్టండి.

4. ఉదయం లేచాక తాజా బీట్రూట్ ని తీసుకొని పైన తొక్కను తీసేయండి.

5.ఆ తర్వాత చిన్న ముక్కలుగా కోసి మిక్సీ జార్ లో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోండి.

6. ఆ పేస్ట్ ను రాత్రంతా పులియబెట్టిన మిశ్రమంలో వేసి బాగా కలపండి.

7.దీనిలోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోండి.

8. ఒక అరగంట పక్కన పెట్టుకోండి. మీకు బీట్రూట్ పచ్చివాసన వస్తుంది అనిపిస్తే బీట్రూట్‌ను ముక్కలుగా కోసిన తర్వాత నూనెలో

కాసేపు వేయించి తర్వాత మిక్సీలో మెత్తగా రుబ్బుకుని కలుపుకోవచ్చు.

9. ఇప్పుడు ఇడ్లీ పిండి రెడీ అయ్యాక ఇడ్లీ ప్లేట్లకు నెయ్యి లేదా నూనె రాసి ఇడ్లీ పిండిని వేసుకోండి.

10. ఓ పావు గంట సేపు ఆవిరి మీద ఉడికిస్తే ఇడ్లీలు రెడీ అయిపోతాయి.

11. ఇవి పింక్ రంగులో విచ్చుకున్న గులాబీలు ఉంటాయి.

12. వీటిని పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈ బీట్రూట్ ఇడ్లీతో కొబ్బరి చట్నీతో తింటే ఆ రుచే వేరు.

మనం తినే అన్ని కూరగాయలతో పోలిస్తే బీట్రూట్ ఎంతో ఆరోగ్యకరమైనది . . దీన్ని ఎలా వండినా పెద్దగా టేస్ట్ అనిపించదు. అందుకోసమే బీట్రూట్ తినే వారి సంఖ్య చాలా తక్కువ. కానీ శరీరంలో రక్తహీనత సమస్య ఉన్నవారు కచ్చితంగా తినాల్సిన వాటిల్లో బీట్రూట్ ఒకటి. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కాలేయాన్ని శుభ్రపరుస్తుంది. చర్మ సంబంధ వ్యాధులు రాకుండా అడ్డుకుంటుంది. కాబట్టి బీట్రూట్ ను ఇంటిల్లిపాది వారానికి కనీసం రెండు మూడు సార్లు తినాలి. ముఖ్యంగా రక్తహీనత సమస్య మహిళల్లో, పిల్లల్లో అధికంగా ఉంటుంది. కాబట్టి వారానికి కనీసం మీరు నాలుగు సార్లు బీట్రూట్ తినడం ద్వారా ఆ సమస్య నుంచి తప్పించుకోగలరు.అలా అని ప్రతి రోజు బీట్రూట్ ను తినవద్దు. ఎందుకంటే వీటిలో ఆక్సలైట్లు ఉంటాయి. ఇవి శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలను పెంచుతాయి. దీనివల్ల కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. రోజూ బీట్రూట్ జ్యూస్ తాగే వాళ్ళు ఉంటారు. అయితే అరగ్లాసు బీట్రూట్ జ్యూస్ లో అర గ్లాసు నీళ్లు కలుపుకొని తాగడం చాలా మంచిది. ప్రతిరోజు తాగే కన్నా రెండు మూడు రోజులకు ఒకసారి తాగితే మంచిది.ఇలా మనకు అందుబాటులో ఉన్న బీట్రూట్ ను వినియోగించుకొని రక్త హీనత సమస్యని తగ్గించుకోవచ్చును. అంతేకాని బ్లడ్ తక్కువగా ఉంది అని బ్లడ్ ఎక్కించుకోవడం లాంటివి చేయకూడదు . దీని వలన అనేక సమస్యలు వస్తాయి .





Untitled Document
Advertisements