ఎండకాలంలో ఇల్లు చల్లగా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించండి

     Written by : smtv Desk | Mon, Apr 01, 2024, 10:03 AM

ఎండకాలంలో ఇల్లు చల్లగా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించండి

ఎండా కాలం వచ్చిందంటే చాలు ఎండలు మండిపోతాయి . అంతేకాదు ఇంకా ఇంటి పై కప్పు కూడా మండిపోతుంది . ఎప్పుడైతే వాతావరణంలో వేడి పెరుగుతుందో ఇంట్లో కూడా వేడి ఎక్కువైపోతుంది. రోహిణి కార్తీ వచ్చింది అంటే రోళ్ళు పగిలిపోయే ఎండలు ఉంటాయి అనే సామెత కూడా ఉంది . అది దృష్టిలో పెట్టుకొని మన ఇల్లు చల్లగా ఉండడానికి ఏ సీ పెట్టుకుంటాము . కానీ ప్రతిసారీ రోజంతా ఏసీలు వేసుకొని ఉండలేము. ఎందుకంటే కరెంటు బిల్లులు కూడా పెరిగిపోతాయి. కాబట్టి సహజంగానే ఇంటిని చల్లగా ఎలా ఉంచుకోవాలో చూదాం . వీటిని ఫాలో అయితే కొంతమేరకు మీ ఇల్లు చల్లగా ఉండే అవకాశం ఉంది.
మీ ఇల్లు చల్లగా ఉండాలంటే చిన్న చిన్న పనులు కూడా చేయాల్సి వస్తుంది. ముఖ్యంగా మీ ఇంట్లో బల్బులను మార్చండి. ఎల్ఈడి లైట్లను పెట్టుకోవడం వల్ల శక్తి ఆదా అవుతుంది. దీనివల్ల ఇల్లు కూడా చల్లగా ఉంటుంది. అదే ట్యూబ్ లైట్లు వల్ల ఎక్కువ ఉష్ణం ఉద్గారం జరిగే అవకాశం ఉంది. ఇలా ఇలాంటి బల్బులను వాడడం వల్ల కొంత మేరకు ఉష్ణోగ్రత ఇంట్లో తగ్గుతుంది.అంతే కాకుండా మీరు ఇంట్లో ఉన్నప్పుడు కాటన్ వస్త్రాలను కచ్చితంగా వేసుకోండి. అవి వదులుగా ఉండేలా చూసుకోండి. దీనివల్ల మీకు శ్వాస సరిగా ఆడుతుంది. శరీరం చల్లబడుతుంది. గాలి దుస్తులలోంచి శరీరానికి తగిలేలా చూసుకోవాలి. అలాగే మంచాలపై కాటన్‌తో చేసిన దుప్పట్లను మాత్రమే పరచండి.
ఒక పెద్ద గిన్నెలో నీళ్లు వేసి వాటిలో ఐస్ క్యూబ్స్ వేసి గదికి ఒక మూల దాన్ని ఉంచండి. ఇప్పుడు ఫ్యాన్ వేయడం వల్ల ఫ్యాన్ గాలి ఆ చల్లదనాన్ని లాక్కుంటుంది. దీని వల్ల కూడా ఇల్లు కాస్త చల్లగా ఉంటుంది.మరి వేడి అధికంగా ఉన్నప్పుడు చల్లని నీటిని తాగుతూ ఉండండి. అలాగే చల్లని నీటిలో ముంచిన వస్త్రంతో ముఖాన్ని తుడుచుకుంటూ ఉండండి. దీనివల్ల శరీరం చల్లబడుతుంది. వేసవి వేడిని తట్టుకునే శక్తి వస్తుంది.
ఇంట్లో చాలా గదులు ఉంటాయి. మీరు ఎక్కువగా వాడే గదిలోనే ఉండి.. మిగతా గదులు తలుపులను వేసేయండి. వాటి ద్వారా వేడి మీరున్నచోటకి రాకుండా అడ్డుకోవచ్చు.ఇంట్లోని సీలింగ్ ఫ్యాన్లను వేసవిలో సవ్య దిశలో కాకుండా అపసవ్య దిశలో తిరిగేలా సెట్ చేయండి. దీనివల్ల గాలి నేరుగా కిందకి నెట్టడం జరుగుతుంది. దీనివల్ల శీతల ప్రభావం పుడుతుంది.

మీ ఇంటి చుట్టూ కిటికీల దగ్గర, ద్వారాలు దగ్గర మొక్కలను కుండీలతో పెట్టేందుకు ప్రయత్నించండి. మొక్కలు దాదాపు వేడిని గ్రహిస్తాయి. చల్లని వాతావరణాన్ని ఉండేలా చూస్తాయి. ఇల్లు చల్లగా ఉండేందుకు బ్లైండ్లను మూసివేయండి. ముఖ్యంగా ఉత్తరం వైపు, పడమర వైపు ఉన్న కిటికీల దగ్గర కర్టెన్లను లేదా బ్లైండ్లను మూసి ఉంచడం మంచిది.
తరచూ నీళ్లు తాగడం మర్చిపోవద్దు. శరీరంలో నీళ్లు తాగితే డిహైడ్రేషన్ సమస్య మొదలవుతుంది. శరీరానికి ఎంత నీటిని అందిస్తే అంతగా వేడిని తట్టుకునే శక్తి దానికి వస్తుంది. వేడిగా ఉండే ఆహారాలు తినడం మానేయండి. గది ఉష్ణోగ్రత వద్ద ఉన్న ఆహారాలే తినడం మంచిది. చక్కెర పానీయాలను ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. వేసవిలో చక్కెర పానీయాలు అధికంగా తాగితే డిహైడ్రేషన్ సమస్య ఎక్కువైపోతుంది. దీనివల్ల ఉష్ణోగ్రతను తట్టుకునే శక్తి శరీరానికి ఉండదు. మజ్జిగ, నిమ్మరసం వంటివి తాగడం వల్ల శరీరం శక్తి పుంజుకుంటుంది.అంతేకాకుండా డాబా ఇల్లు ఉన్నవారు తమ డాబాలపై మొక్కలను అధికంగా పెంచడం ద్వారా కిందకి వేడి దిగకుండా జాగ్రత్త పడవచ్చు. లేదా ఖాళీ ప్రదేశాలు ఉంటే ఇంటి పక్కనే ఒక మొక్కను నాటి అది చెట్టుగా ఎదిగేంత వరకు ఉండాలి. అది చెట్టుగా ఎదిగితే ఇంటిపై దాని నీడ పడి వేడి చాలా వరకు తగ్గుతుంది. ఈ మధ్య కాలంలో ఇంటి పై కప్పుకు వేయడానికి పెయింట్ దొరుకుతుంది దీనిని ఉపయోగించండి దీని వలన మీ ఇల్లు చల్లగా ఉంటుంది . ఈ విధంగా చిన్న చిన్న మార్పులతో మీ ఇంటిని చల్లగా ఉంచుకోవచ్చును .





Untitled Document
Advertisements