శ్రీశైలం వెళ్లే భక్తులకు అలర్ట్.. ఏప్రిల్ 5 నుండి 10 వరకు ఆ దర్శనాలు రద్దు

     Written by : smtv Desk | Mon, Apr 01, 2024, 12:13 PM

శ్రీశైలం వెళ్లే భక్తులకు అలర్ట్..  ఏప్రిల్ 5 నుండి  10 వరకు ఆ దర్శనాలు రద్దు

సాధారణంగా మన తెలుగు వారు ఎక్కువగా జ్యోతిర్లంగాలో రెండవది అయినా శ్రీశైలము వెళ్తుంటారు ఇక్కడ అమ్మవారు బ్రమ రంభ దేవిగా, శివుడు మల్లికార్జున స్వామి వారీగా దర్శనము ఇవ్వడం వలన భక్తులు ఎక్కువగా వస్తూ ఉంటారు . ఇక్కడికి వచ్చే భక్తులకు ఎలాంటి భంగం కలగకుండా భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆలయ అధికారులు దర్శనాలు, అభిషేకాలు, కుంకుమార్చనలపై క్లారిటీ ఇచ్చారు. ఆలయంలో ఉగాది ఉత్సవాలను వైభవం, పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాటు చేయాలని ఆలయ ఈవో పెద్దిరాజు ఆదేశించారు. ఏప్రిల్‌ 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఉగాది మహోత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు. భక్తులకు ఎటువంటి లోపాలు జరుగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఎండతీవ్రత కారణంగా క్యూకాంప్లెక్సుల అవసరాల మేరకు కూలర్ల ను ఏర్పాటు చేయాలని వివరించారు.

ఈ ఉత్సవాల సందర్బంగా ఆలయంలో స్వామివారి గర్భాలయ సామూహిక అభిషేకాలను దేవస్థానం తాత్కాలికంగా రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. అమ్మవారి ఆలయంలో కుంకుమార్చన పూజలు కూడా రద్దు చేశారు. ఏప్రిల్ 6 నుంచి 10 వరకు శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా శ్రీశైలం ఆలయంలో స్వామి అమ్మవార్ల అభిషేకాలు కుంకుమార్చన పూజలు ఇవాళ్టి నుంచే నిలిపివేశారు. శ్రీశైలం దేవస్థానం వారు వెబ్‌సైట్‌లో ఆన్ లైన్ సేవా టికెట్లు స్వామి అమ్మవార్ల గర్భాలయ అభిషేకాలు , సామూహిక అభిషేకాల , టికెట్లు ఆన్ లైన్‌లో లేకపోవడంతో భక్తులు గందరగోళంలో ఉన్నారు.
ముందుగా స్వామివారి గర్భాలయ అభిషేకాలు నిలుపుదల చేస్తున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించలేదంటున్నారు. అందుకే భక్తుల్లో గందరగోళానికి కారణం అంటున్నారు. నేటి నుంచి స్వామివారి వీఐపీ బ్రేక్ దర్శనాలు స్వామివారి గర్భాలయ స్పర్శ దర్శనాలకు విడతలవారీగా భక్తులను అనుమతించనున్నారు. రోజుకు నాలుగు విడతలుగా ఏప్రిల్ 5 వరకు భక్తులకు అనుమతి లభించనుంది. ఏప్రిల్ 6 నుంచి 10 వరకు శ్రీశైలం ఆలయంలో స్వామివారి స్పర్శ దర్శనాలు వీఐపీ బ్రేక్ దర్శనాలు కూడా దేవస్థానం రద్దు చేసింది. భక్తులందరికీ అలంకార దర్శనానికి మాత్రమే అనుమతి లభించనుంది. భక్తుల రద్దీకి అనుగుణంగా స్వామివారి దర్శనం వేళల్లో దేవస్థానం మార్పులు చేసింది.
మరోవైపు శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న శాశ్వత అన్న ప్రసాద పథకానికి అనేక మంది విరాళాలు కూడా ఇస్తున్నారు . ఇక్కడ ఉన్న ఈ అన్నదానం వలన వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంది పైన తెలిపిన విషయాలను దృష్టిలో పెట్టుకొని శ్రీశైలం వెళ్లే వారు టికెట్స్ ఆన్ లైన్లో బుక్ చేసుకొని వెళ్ళాలి ఆలా అయితే చిన్న పిల్లలు ముసలి వారికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది .





Untitled Document
Advertisements