ఇంటికి రేడియేషన్ రాకుండా చేసే మొక్కలు ఇవే!

     Written by : smtv Desk | Mon, Apr 01, 2024, 12:33 PM

ఇంటికి రేడియేషన్  రాకుండా చేసే మొక్కలు ఇవే!

మనకు ప్రకృతి ప్రసాదించిన గొప్ప వరం ఏమిటి అంటే మొక్కలు అని చెప్పవచును . ఎందుకంటే ఈ మొక్కలను పెంచడం ద్వారా మనకు అనేక ప్రయోజనాలు ఉన్నాయి. కొంత మంది మొక్కలను పెంచేందుకు చాల ఆసక్తి చూపిస్తుంటారు. తమ ఇండ్లను సైతం ప్రకృతి వనంలా మార్చేస్తుంటారు.అలాంటి వారిలో ఒకరైన హనుమకొండ జిల్లా శాయంపేట మండలం పెద్ద కోడెపాక గ్రామానికి చెందిన కోమనేని రఘు అనే ప్రైవేటు ఉపాధ్యాయులు అరుదైన మొక్కలను పెంచడం తన హాబీగా పెట్టుకున్నారు. తమ ఇంటిని ప్రకృతి వనంలా మార్చేశారు. ఇక్కడ పెరుగుతున్న ప్రతి మొక్క ప్రత్యేకమే.ఎక్కడో దక్షిణాఫ్రికాలో ఎడారిలో పెరిగే ముళ్ల మొక్కలు ఇక్కడ పెరుగుతున్నాయి. ఈ మొక్కలకు రేడియేషన్ ను కంట్రోల్ చేసేందుకు దోహాదపడుతాయి. అయితే తమ ఇంటి ఆవరణలో సుమారు 80 అరుదైన కాక్టస్ మొక్కలను పెంచుతున్నామని ఆయన తెలిపారు.ఈ మొక్కలను పెంచడం వలన ఫోన్ నుండి వచ్చే రేడియషన్ ను కంట్రోల్ చేయవచ్చు అని తెలుస్తుంది .

కొన్ని రకాలైన కాక్టస్ మొక్కల గురించి చూదాము . ఓల్డ్ మాన్ కాక్టస్, కాటన్ బాల్ కాక్టస్, ఏచినాప్సిస్, స్టార్ కాక్టస్, కార్పెట్ కాక్టస్, బన్నీ ఇయర్ కాక్టస్, రౌండ్ కాక్టస్, మడగాస్కర్ కాక్టస్, కోరల్ కాక్టస్ ఇలా పలు రకాల కాక్టస్ మొక్కలను పెంచుతున్నట్లు తెలుస్తుంది . ఈ కాక్టస్ మొక్కల వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని చెప్పారు. అవి మొబైల్ నుంచి మరియు పరికరాల నుంచి వచ్చే రేడియేషన్ ను తగ్గించే శక్తి కాక్టస్ మొక్కలకు ఉంటుందన్నారు.

అంతేకాకుండా ఈ కాక్టస్ మొక్కలకు పూసే పూలు కూడా చాలా అందంగా ఉంటాయన్నారు. కానీ కొంతమంది కాక్టస్ లాంటి ముళ్ల మొక్కలు ఇళ్ల లో ఉండకూడదని ప్రజలు విశ్వసిస్తారని, అది ఒక భ్రమ అంటూ ఆయనకొట్టిపారేశారు. ఈ కాక్టస్ మొక్కలను సేకరించడానికి చాలా సమయం పట్టిందన్నారు.కొన్ని సంవత్సరాల నుంచి వీటిని పెంచుతున్నామన్నాని తెలిపారు. వెస్ట్ బెంగాల్, రాజస్థాన్ మరియు ఇతర దేశాల నుంచి వీటిని తీసుకువచ్చినట్లు చెప్పారు. మనల్ని రేడియేషన్ నుంచి రక్షించే గొప్ప శక్తి ఏదైనా మొక్క ఉందంటే అది ఒక్క కాక్టస్ మొక్కనే అని తెలుస్తుంది . కావున మనకు తెలియకుండానే ఎన్నో రకాలైన మొక్కలు ఎన్నో విధాలుగా ఉపయోగపడతాయి వాటిని గుర్తించి మనము వినియోగించుకోవాలి .





Untitled Document
Advertisements