వేసవిలో ఉల్లిపాయల్ని తినడం వలన ఏంజరుగుతుందో తెలుసా?

     Written by : smtv Desk | Mon, Apr 01, 2024, 01:11 PM

వేసవిలో  ఉల్లిపాయల్ని తినడం వలన ఏంజరుగుతుందో తెలుసా?

పూర్వకాలంలో ఒక సామెత ఉంది ఉల్లి చేసిన మేలు తల్లీ కూడా చేయదు అని అంటే ఉల్లి అంత మేలు చేస్తుంది అని అర్థం . ఎందుకంటే ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. వీటిని రెగ్యులర్‌గా తీసుకుంటే జీర్ణ ఆరోగ్యానికి మంచిది. ఇది ప్రేగు కదలికలని సులభతరం చేస్తుంది. అంతేకాకుండా, మలబద్ధకం వంటి సమస్యలు కూడా దూరమవుతాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్ కొలస్ట్రాల్ స్థాయిలని తగ్గించి గుండె జబ్బులని దూరం చేస్తుంది. ఇందులోని ఫైబర్ రక్తంలో చక్కెరస్థాయిని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడతాయి . అంతేకాకుండా ఉల్లిపాయల్లో కాల్షియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. కావున ఎముకల ఆరోగ్యానికి మంచిది. ఇందులోని క్వెర్సెటిన్, సల్ఫర్ కంటెంట్ ఎముకల సాంద్రతని నిర్వహించడానికి, ఎముకలు దెబ్బతినకుండా నిరోధించడంలో సాయపడుతుంది. ఆహారంలో ఉల్లిపాయల్ని చేర్చుకోవడం వల్ల ఎముకల ఆరోగ్యాన్ని కాపాడతాయి. బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తుంది.


ఉల్లిపాయల్లోని కొన్ని పదార్థాలు చక్కెర స్థాయిలని తగ్గించడానికి హెల్ప్ చేస్తాయి. ఉల్లిపాయ ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగ్గా చేసి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. ఉల్లిపాయని ఆహారంలో భాగంగా చేసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలని బ్యాలెన్స్ చేస్తాయి. ఇందులో ఓ రకమైన పీచు పదార్థం ఉంటుంది. ఇవి ప్రీ బయోటిక్‌గా పనిచేస్తాయి. ప్రీ బయోటిక్స్ గట్‌ బ్యాక్టీరియాకి చాలా మంచిది. జీర్ణక్రియని మెరుగ్గా చేసి పోషకాల శోషణకి హెల్ప్ చేసి మొత్తం గట్ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఉల్లిపాయల్ని రెగ్యులర్‌గా తీసుకుంటే గట్ బ్యాక్టీరియా బ్యాలెన్స్ అవుతుంది. వీటిలో విటమిన్ సి, విటమిన్ బి6 లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి జీవక్రియని పెంచుతాయి. నాడీవ్యవస్థని మెరుగ్గా చేస్తుంది. వీటిని తీసుకుంటే ఇందులోని విటమిన్ సి ఆరోగ్యానికి చాలా మంచిది.


ఉల్లిపాయల్లో ఫ్లేవనాయిడ్స్, సల్ఫర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి శరీరంలో మంటను తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. గుండె జబ్బులు, షుగర్, క్యాన్సర్స్ వంటి సమస్యల్ని దూరం చేస్తాయి.ఇందులోని అల్లిసిన్, సల్ఫర్ వంటి యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలు కలిగి ఉంటాయి. వీటిని ఎక్కువగా తీసుకుంటే ఇమ్యూనిటీని పెంచి ఇన్ఫెక్షన్ల నుండి కాపాడతాయి.కావున మనం రోజు కూరగాయలను చేసుకోవడానికి వినియోగించే ఉల్లిపాయలో ఎన్నో రకాలైన ఉపయోగాలు ఉన్నాయి . అందుకని ఈ వేసవి కాలంలో ఉల్లిపాయని మజిగ్గ తో కానీ రాగి జావతో కానీ కలిపి తీసుకుంటే చాల చలువ చేస్తుంది .






Untitled Document
Advertisements