పోట్టిబట్టలు ధరిస్తున్న కూతురికి ఐఫోన్ బహుకరించి కనువిప్పు కలిగించిన తండ్రి

     Written by : smtv Desk | Mon, Apr 01, 2024, 04:25 PM

పోట్టిబట్టలు ధరిస్తున్న కూతురికి ఐఫోన్ బహుకరించి కనువిప్పు కలిగించిన తండ్రి

ఒక అమ్మాయికి-ఆమె తండ్రి బర్త్ డే సందర్భంగా ఐఫోన్ బహుమతిగా ఇచ్చాడు.ఆ తర్వాత రోజు తండ్రి ఆ అమ్మాయిని అడిగాడు, ఐఫోన్ తెచ్చుకున్న తర్వాత నువ్వు మొదట ఏం చేశావు. అని. అందుకు సమాధానంగా

అమ్మాయి :- నాన్న నేను స్క్రాచ్ గార్డ్ మరియు కవర్ ఆర్డర్ చేసాను అన్నది అప్పుడు

తండ్రి :- ఇలా చేయమని ఎవరైనా బలవంతం చేసారా అని అడిగాడు దానికి

అమ్మాయి :- ఎవరూ లేరు ఎందుకు అలా అడిగావు నాన్న అన్నది .

తండ్రి :- నీవు ఫోన్ కి కవర్ కోనుకున్నావు కదా , ఐఫోన్ తయారీదారుని అవమానించినట్లు అనిపించలేదా..?

కుమార్తె :- లేదు, కానీ తయారీదారు స్వయంగా కవర్ మరియు స్క్రాచ్ గార్డును వేసుకోమని సలహా ఇచ్చాడు

తండ్రి :- సరే ఐతే ఐఫోన్ కూడా చెడ్డగా కనబడుతోంది, అందుకే దానికి కవర్ ఆర్డర్ చేశావా

అమ్మాయి :- లేదు, అది చెడిపోకూడదు, అందుకే కవర్ ఆర్డర్ చేసాను..

తండ్రి :- కవర్ వేశాక దాని అందం ఏమైనా తగ్గిందా

అమ్మాయి :- లేదు నాన్న , దానికి కవర్ వేసిన తర్వాత ఐఫోన్ మరింత అందంగా కనిపిస్తుంది.

అప్పుడు తండ్రి ఆప్యాయంగా కూతురి వైపు చూస్తూ ఇలా అన్నాడు .అమ్మా ఒక మొబైల్ ఫోన్ కాలపరిమితి సుమారు మూడు నుండి నాలుగు సంవత్సరాలు ఉంటుంది అది ఎలా ఉన్నా పని చేస్తుంది, అయినా కూడా నీవు దానికి, కవర్ వేసుకోమని నిన్ను ఎవ్వరు బలవంతపెట్టలేదు, పైగా కవర్ వేయడం వల్ల అది ఇంకా అందంగా కనిపిస్తుంది , ఇంకా ఎక్కువ రోజులు మన్నికగా ఉంటుంది. కాబట్టి దానికి శ్రద్దగా స్క్రీన్ గార్డ్ వేసి కవర్ వేసి జాగ్రత్తగా ఉంచావు కదా,
మరి నీ శరీరం ఐఫోన్ కంటే విలువైనది మరియు అందమైనది కదా ఈ ప్రపంచంలో ప్రతి ఆడపిల్లకి అన్నిటికంటే ఎక్కువ తన శరీరం, తన అందం , అలాగే ఆడపిల్ల ఇంటికి గౌరవం. నిండుగా బట్టలు ధరించడం వలన ఆడపిల్ల శరీర భాగాలను బట్టలతో కప్పడం వల్ల ఆమె అందం పెరుగుతుంది. తగ్గదు తల్లి అన్నాడు.అప్పుడు చూడాలి ఆ కూతురి ముఖం తన తండ్రి ముందు కన్నీళ్లు తప్ప ఆ కూతురి వద్ద సమాధానం లేదు.కాబట్టి ప్రతి ఆడపిల్లలు తాము ఎంత అందంగా ఉన్నామో అని కాదు ఎంత సంప్రదాయంగా ఉన్నామో చూసుకోవాలి అప్పుడే భారతీయ సంస్కృతి, విలువలను కాపాడుతాము .





Untitled Document
Advertisements