శొంఠిని ఆహారంలో భాగం చేసుకుంటే మీ శరీరంలో జరిగే మార్పులు ఇవే!

     Written by : smtv Desk | Tue, Apr 02, 2024, 09:50 AM

శొంఠిని ఆహారంలో భాగం చేసుకుంటే మీ శరీరంలో జరిగే మార్పులు ఇవే!

ఈ మధ్య కాలంలో చాల మంది వారు చేసే జాబ్స్ వలన టైం సరిపోక ఎదో ఒక సమయానికి తింటున్నారు . దాని వలన ఎన్నో రకాలైన రోగాల బారిన పడుతున్నారు . అందులో ఒకటి గ్యాస్ట్రిక్ సమస్య . ఇది ఏ వయస్సు అనే సంబంధం లేకుండా ఈ సమస్య బాధపెడుతుంది . దీని నుండి ఉపశమనం పొందడానికి మన కిచెన్ లో వాడే శొంఠిని ఉపయోగించుకొని తగ్గించుకోవచ్చును . అంతేకాకుండా శొంఠి పొడిలో అనేక పోషకాలు ఉన్నాయి. వాటి వల్ల ఎన్నో ఔషధ గుణాలు శొంఠి సొంతం అందుకే వ్యాధులను నయం చేసేందుకు ఆయుర్వేదంలో శొంఠిని, శొంఠి పొడిని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు.


100 గ్రాముల శొంఠిలో 2.3 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. 12.3 గ్రాముల కార్బోహైడ్రేట్స్​, 20 గ్రాముల కాల్షియం ఉంటాయి. అంతేకాదు.. 60 గ్రాముల ఫాస్​ఫరస్​ కూడా ఉంటుంది. శొంఠిలో ఫైబర్​ పుష్కలంగా ఉంటుంది.

గ్యాస్​ సమస్యలను దూరం చేయడంలో శొంఠి అద్భుతంగా పనిచేస్తుంది. శొంఠితో రోగ నిరోధక శక్తి వేగంగా మెరుగుపడుతుంది. శరీరంలోని ఇన్​ఫ్లమేషన్​ తగ్గుతుంది.మీ డైట్​లో శొంఠి ఉంటే చాలు రెగ్యులర్ గా వచ్చే ఫ్లూ, జలుబు, ఇన్​ఫ్లుయెంజా వంటి రోగాలతో పోరాడే శక్తి లభిస్తుంది.అంతేకాకుండా గోరు వెచ్చని నీటిలో శొంఠి పొడిని కలుపుకుని రోజు తాగితే మంచి ఫలితాలు పొందొచ్చు.ఇన్ని రకాలైన పోషకాలు , ఉపయోగాలు ఉన్న శొంఠిని,మన డైలీ ఆహారంలో భాగంగా చేసుకొని తినవచ్చును .





Untitled Document
Advertisements