చర్మం మెరవాలంటే ఇంట్లో లభించే పాలతో ఇలా చేయండి

     Written by : smtv Desk | Tue, Apr 02, 2024, 11:53 AM

చర్మం మెరవాలంటే ఇంట్లో లభించే పాలతో ఇలా చేయండి

చిన్న పిల్లల నుండి పెద్ద వాళ్ళ వరకు ముఖం అందంగా ఉంచుకోవడానికి చూస్తూ ఉంటారు . దాని కోసము మన ఇంట్లో వాడే పాలను వినియోగించుకోని ముఖము మీద ఉండేటటువంటి మొటిమలను , మచ్చలను కూడా తొలిగించుకోవచ్చును . ఎందుకంటే పాలలో బయోటిన్, మాయిశ్చరైజింగ్ కారకాలు ఉన్నాయి. ఇవి చర్మాన్ని కాపాడి హైడ్రేట్ చేస్తాయి. దీంతో పాటు లోపలి నుండి తేమని కాపాడేందుకు చర్మంలోకి లోతుగా చొచ్చుకుపోతాయి. పాలలో బీటా హైడ్రాక్సీ యాసిడ్ అనే ఎక్స్‌ఫోలియేటింగ్ ఏజెంట్ ఉంటుంది. ఇది మీ చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేస్తుంది. డెడ్‌ స్కిన్ సెల్స్, బ్లాక్‌హెడ్స్, వైట్‌హెడ్స్‌ని తొలగిస్తుంది. దీంతో చర్మం మెరుస్తుంది.

పాలలో విటమిన్ ఎ, విటమిన్ డి, విటమిన్ బి 12, కాల్షియం, ప్రోటీన్ వంటి విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. చర్మ ఆరోగ్యాన్ని కాపాడడంలో ఇవన్నీ కూడా కీ రోల్ పోషిస్తాయి. పాలలో మాయిశ్చరైజింగ్ ఏజెంట్స్‌ని కలిగి ఉంటాయి. ఇది మీ చర్మంపై మంచి టోనర్‌లా పనిచేస్తుంది. ఇది చర్మాన్ని మృదువుగా చేసి చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. పాలు సహజ సన్‌స్క్రీన్, టాన్ రివర్సింగ్ ఏజెంట్‌లా పనిచేస్తుంది. పచ్చి పాలని రెగ్యులర్‌గాఅప్లై చేయడం వల్ల చర్మం దెబ్బతినకుండా, సన్‌బర్న్ వల్ల కలిగే ఇబ్బందిని తగ్గించుకోవచ్చు.
​ పాలలోని మెగ్నీషియం ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి ముడతలు, ఫైన్‌లైన్స్ రాకుండా చేస్తాయి. కొల్లాజెన్‌ ఉత్పత్తిని పెంచడం ద్వారా యంగ్‌గా కనిపించేలా చేస్తాయి. చర్మంపై పాలని రెగ్యులర్‌గా రాయడం వల్ల టైరోసిన్ స్రావాన్ని నిరోధిస్తుంది. మెలనిన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా మార్చి మెరిసేలా చేస్తుంది.అంతేకాకుండా పాలతో మసాజ్ చేయడం వల్ల చర్మ సమస్యలు తామర, సోరియాసిస్ వంటి చర్మ సమస్యలు దూరమవుతాయి. ఇలా మనకు కిచెన్ లో అందుబాటులో ఉండే వాటిని వినియోగించుకొని అందంగా తయారు అవ్వవచ్చు . ఈ పాలను వాడడం వలన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా రాకుండా ఉంటాయి .





Untitled Document
Advertisements