ప్రెగ్నెంట్ టైములో తీసుకునే ఫుడ్ మీదే పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్ ఆధారపడి ఉంటుందట

     Written by : smtv Desk | Tue, Apr 02, 2024, 03:25 PM

ప్రెగ్నెంట్  టైములో తీసుకునే ఫుడ్ మీదే పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్ ఆధారపడి ఉంటుందట

కొత్తగా పెళ్ళి అయినా జంటకి తల్లిదండ్రులు అవ్వడం అనేది ఒక కళ . దీని కోసం కొన్ని సార్లు ఎన్నో హాస్పిటల్స్ తిరగవలసింది వస్తుంది . అలా తిరిగిన తర్వాత ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయితే చాల జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంటుంది . ఆ ప్రెగ్నెన్సీ టైమ్‌లో పుట్టబోయే బిడ్డ పెరుగుదలతో పాటు గర్భిణీల శరీర బరువు కూడా పెరుగుతుంది. అయితే, ఉండాల్సిన బరువు ఉండకపోతే ఇది పిల్లల ఎదుగుదలని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. ఈ సమయంలో గర్భిణీలు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. పిల్లల అభివృద్ధిలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. రోజులు పెరిగే కొద్దీ బరువు పెరుగుతారు. అయితే, తగినంత ఎదుగుదల లేకుంటే ముందే డెలివరీ అవ్వడం, పుట్టినవారు తక్కువ బరువుతో పుట్టడం, బిడ్డ పెరగకపోవడం, అనేక సమస్యలకి దారి తీస్తుంది. కాబట్టి, బరువు విషయంలో చాల జాగ్రత్తగా ఉండాలి.

ప్రెగ్నెన్సీ టైమ్‌లో, గర్బధారణకి ముందు స్త్రీలు ఫాలో అయ్యే డైట్ పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంపై ఎఫెక్ట్‌ని చూపిస్తుంది. తల్లి బరువు తక్కువగా ఉంటే పుట్టే బిడ్డ బ్రెయిన్ డెవలెప్‌మెంట్ మందగించడం, తక్కువ బరువుతో పుట్టడం వంటి సమస్యలు వస్తాయి.
గర్భాశయంలోని వాతావరణం పుట్టే పిల్లల ఎదుగుదలకి అనుకూలంగా ఉండాలి. గర్భిణీలకి పోషకాలు లోపిస్తే పుట్టబోయే బిడ్డకి పోషకాలు అందవు. దీని కారణంగా ఎదుగుదల సరిగ్గా ఉండదు. కాబట్టి, ముందుగానే పిల్లలు పుట్టే అవకాశం ఉంది. అదే విధంగా పుట్టిన పిల్లలకి కూడా భవిష్యత్‌లో సమస్యలొస్తాయి. పెరుగుదల లోపం, ఇతర సమస్యలొస్తాయి.
​ సాధారణంగా ప్రెగ్నెంట్స్ తక్కువగా బరువు ఉంంటే పోషకాల లోపం తక్కువగా ఉన్నట్లే. దీని వల్ల బిడ్డ ఎదుగుదలపై ఎఫెక్ట్ చూపిస్తుంది.అంతేకాకుండా ఫోలేట్, ఐరన్, క్యాల్షియం వంటి సూక్ష్మపోషకాలు లోపిస్తే మెదడు నరాల బలహీనత, పిల్లల్లో ఎముకల బలహీనత తగ్గడం వంటి సమస్యలు వస్తాయి. ఇవే కాకుండా ఇమ్యూనిటీ తగ్గడం, పుట్టిన తర్వాత కూడా ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి.కావున ఈ విషయాలు దృష్టిలో పెట్టుకుని ప్రెగ్నెన్సీ తో ఉన్నప్పుడు మంచి బలమైన ఫుడ్ తీసుకోవాలి . అప్పుడే పుట్టబోయే బిడ్డ ఎలాంటి లోపాలు లేకుండా పుట్టుతుంది .





Untitled Document
Advertisements