సమ్మర్ స్పెషల్ గా కోవా నువ్వుల లడ్డూ చేశారంటే పిల్లలు లొట్టలేసుకుంటూ తినేస్తారు

     Written by : smtv Desk | Wed, Apr 03, 2024, 10:04 AM

సమ్మర్ స్పెషల్ గా  కోవా నువ్వుల లడ్డూ చేశారంటే పిల్లలు లొట్టలేసుకుంటూ తినేస్తారు

మనలో చాల మందికి స్వీట్స్ అంటే చాల ఇష్టం . కానీ ప్రస్తుత పరిస్థితిలో షుగర్ తో చేసిన పదార్థాలు అధికంగా తింటే ఇతర సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కావున వీటి ప్లేసులో బెల్లం కానీ వేరే ఇతర వాటిని వాడుకొని చేసుకోవడం వలన మన ఆరోగ్యం చాల మంచిగా ఉంటుంది .కాబట్టి బెల్లం, నువ్వులు, కోవా కలిపి లడ్డూ చేసి చూడండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. ఆరోగ్యానికి ఇది ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా పిల్లలకు ఇది చాలా నచ్చుతుంది. దీన్ని చేయడం చాలా సులువు. కేవలం అరగంటలో వీటిని చేసేయొచ్చు. అప్పటికప్పుడు చేసుకొని తినే స్వీట్లలో ఇది కూడా ఒకటి.


కోవా నువ్వుల లడ్డు రెసిపీకి కావాల్సిన పదార్థాలు:

నువ్వులు - అరకప్పు

కోవా - అరకప్పు

బెల్లం తురుము - అర కప్పు

బాదం పొడి - ఒక కప్పు

నెయ్యి - రెండు స్పూన్లు

కోవా నువ్వుల లడ్డూ తయారీ విధానము :

ఈ లడ్డూ తయారీలో కేవలం తెల్ల నువ్వులను మాత్రమే తీసుకోవాలి.

ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టి నువ్వులను వేసి వేయించుకోవాలి. ఆ నువ్వులు బాగా వేగాక తీసి మిక్సీలో వేసి మెత్తగా పొడి

చేసుకోవాలి. ఇప్పుడు అదే బాణలిలో కోవా వేసి బాగా కలపాలి.చిన్న మంట మీదే దీన్ని వండాలి. లేకపోతే కోవా త్వరగా మాడిపోయే

అవకాశం ఉంటుంది.ఆ తర్వాత కోవా కరుగుతున్నప్పుడు కాస్త నెయ్యిని కూడా వేసుకోండి. దీని వలన మంచి రుచి వస్తుంది .

ఆ తర్వాత ఇందులోనే బెల్లం తురుము, బాదం పొడి వేసి బాగా కలుపుకోండి. ఈ మిశ్రమం మొత్తం దగ్గరగా అయ్యి గట్టిగా అయ్యేవరకు

ఉంచండి. ఆ మిశ్రమం చల్లారాక వాటిని లడ్డూల్లా చేసుకుని, గాలి చొరబడని డబ్బాల్లో వేసి దాచుకోండి.అంతే నువ్వుల కోవా లడ్డు

తయారు అయినట్లే . వీటిని రోజుకి ఒకటి లేదా రెండూ లడ్డూలు తినడం ద్వారా మంచి ఆరోగ్యం దొరుకుతుంది.



కోవాను తినడం వల్ల క్యాల్షియం అధికంగా శరీరంలో చేరుతుంది. ఎందుకంటే కోవాను పాలతో తయారుచేస్తారు. ఇక బెల్లం రక్తహీనత సమస్యను తగ్గిస్తుంది. ఎందుకంటే బెల్లంలో ఇనుము అధిక శాతం ఉంటుంది. బాదం పొండిలో మనకి శరీరానికి అవసరమైన ఒమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి. నెయ్యి కూడా ప్రతిరోజూ తినడం చాలా అవసరం. నువ్వుల గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రతి వ్యక్తి తినాల్సిన ఆహారాలలో నువ్వులు ఒకటి. ముఖ్యంగా మహిళలు నువ్వులు తినడం వల్ల నెలసరి సమస్యల నుంచి తప్పించుకోవచ్చు. కాబట్టి ఇలాంటి లడ్డూలను తయారు చేసి ఇంట్లో పెట్టుకోండి.ఎందుకంటే ఇందులో మన ఆరోగ్యానికి మేలు చేసే పదార్థాలను ఎన్నో వాడాము. అందువలన వీటిని పిల్లలు పెద్దలు కూడా తినవచ్చును . బయట దొరికే ఫాస్ట్ ఫుడ్ ను పిల్లలకు అలవాటు చేయడం కంటే వీటిని చేసి ఇవ్వడం చాల మంచిది .






Untitled Document
Advertisements