ఎర్లీ మార్నింగ్ జీలకర్ర వాటర్ తీసుకుంటే ఏమౌతుందో తెలుసా?

     Written by : smtv Desk | Wed, Apr 03, 2024, 10:19 AM

ఎర్లీ మార్నింగ్ జీలకర్ర వాటర్ తీసుకుంటే ఏమౌతుందో తెలుసా?

మనం కిచెన్ లో వాడే వంటలలో జీలకర్రను ఎక్కువగా వాడుతూ ఉంటాం. దీనిని తీసుకోవడం వలన ఆహారం సులభంగా జీర్ణమౌతుంది. అంతేకాదు ఈ జీలకర్రను మామూలుగా ఆహారంలా కాకుండా పరగడుపున వీటిని తీసుకోవడం వల్ల మరిన్ని అద్భుతాలు జరుగుతాయని, ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.


జీర్ష సమస్యలకు చెక్:
చాలా మందికి ఉదయం లేవగానే పొట్ట నోప్పినట్లుగా , ఉబ్బినట్లుగా, రాత్రి తిన్న ఆహారం అరగనట్లుగా భావిస్తూ ఉంటారు. అలాంటివారు పరగడుపున జీలకర్ర తినడం అలవాటు చేసుకోవాలి. వీటిని తినడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. ఖాళీ కడుపుతో తినేటప్పుడు రోజంతా ఆహారాన్ని మరింత ప్రభావవంతంగా విచ్ఛిన్నం చేస్తాయి. కడుపు ఉబ్బరం సమస్యలకు పూర్తిగా చెక్ పెట్టేస్తాయి. కొందరికి కడుపులో యాసిడ్ ఫామ్ అయినట్లుగా అనిపించిన ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఎసిడిటీ సమస్యతో బాధపడేవారు ఎవరైనా ఈ జీలకర్రను తమ ఆహారంలో భాగం చేసుకుంటే సరిపోతుంది. ఖాళీ కడుపుతో వాటిని తీసుకోవడం ద్వారా, మీరు ఎసిడిటీ ఆ అసౌకర్య భావాలకు వీడ్కోలు చెప్పవచ్చు.


రోగనిరోధక శక్తి:
జీలకర్రతో రోగనిరోధక శక్తిని కూడా పెంచుకోవచ్చు, ఈ చిన్న మూలకాలు మీ శరీరం , సహజ రక్షణను బలోపేతం చేయడంలో సహాయపడే రోగనిరోధక శక్తిని పెంచడంలో కీలకంగా పని చేస్తాయి. ఖాళీ కడుపుతో జీరా గింజలతో చేసే వాటర్ ను తీసుకోవడం వలన రోగనిరోధక వ్యవస్థను బలంగా మార్చుకోవచ్చు.అంతేకాకుండ చాలా మంది శరీరాన్ని డీటాక్సిన్ చేయడానికి మార్కెట్లోని ఏవేవో డ్రింక్స్ తాగుతూ ఉంటారు. అలా కాకుండా జీలకర్ర ఈ విషయంలో చాలా అద్భుతంగా పని చేస్తుంది.వీటిని నీటిలోమరిగించి ఖాళీ కడుపుతో తీసుకున్నప్పుడు టాక్సిన్స్‌ను తొలగించే అద్భుతంగా పని చేస్తుంది. మీరు పునరుత్తేజిత అనుభూతిని కలిగి ఉంటారు. రోజూ ఈ డ్రింక్ తాగాలనే కోరిక కూడా కలుగుతుంది.

బరువు తగ్గిస్తుంది:
మీరు బరువు తగ్గాలి అనుకుంటే , ఈ సమయంలో మీకు జీలకర్ర బాగా ఉపయోగపడుతుంది. జీలకర్ర మీ జీవక్రియను పెంచుతుంది. ఖాళీ కడుపుతో తీసుకున్నప్పుడు రోజంతా కేలరీలను మరింత ప్రభావవంతంగా బర్న్ చేయడం మీ శరీరానికి సాధ్యపడుతుంది. బరువు తగ్గడతంలో సహాయపడుతుంది.చాల మంది తెలియక బరువు తగ్గడానికి ఎన్నో రకాలైన ప్రయత్నాలు చేస్తుంటారు . కానీ అలా చేయకుండా జీలకర్రవాడుకోవడం చాల మంచిది .






Untitled Document
Advertisements