అన్నీ రకాల ఆహారపదార్థాలు ఫ్రిజ్‌లో పెడుతున్నారా? అయితే ఇది మీకోసమే

     Written by : smtv Desk | Thu, Apr 04, 2024, 10:57 AM

అన్నీ రకాల  ఆహారపదార్థాలు  ఫ్రిజ్‌లో  పెడుతున్నారా? అయితే ఇది మీకోసమే

ప్రస్తుతం ఎండాకాలం కావున మనము చేసిన ఆహారపదార్థాలు పాడు అవుతాయి అందువలన ఎక్కువగా ఫ్రీజ్ లో పెడతాము . కానీ కొన్ని ఆహార పదార్థాలు ఫ్రీజ్ లో పెట్టకూడదు . ఆహార పదార్ధాలు, కూరగాయలు, నీళ్లు, పాలు పెరుగు వరకూ ఓకే కానీ ఏది పడితే అది ఫ్రిజ్ లో పెట్టేసి ఎప్పుడో గుర్తు వచ్చినపుడు తీసుకోవడం వడటం వలన మన ఆరోగ్యము పాడు అవుతుంది అసలు ఫ్రిజ్‌లో కొన్ని రకాలైన ఆహార పదార్థాలు పెట్టకూడదు


పుచ్చకాయ :
పుచ్చకాయలు వేసవి రాగానే ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం. దీనిని కాస్త తిని మిగతాది ఫ్రిజ్ లో పెడతాం. ఇలా పెట్టడం వల్ల దానిలోని పోషకాల శాతం తగ్గుతుంది. అందుకని పుచ్చకాయ పెద్ద ముక్కని ఫ్రిజ్ లో పెట్టడం కాకుండా చిన్న చిన్న ముక్కలుగా కోసి బాక్స్ లో పెట్టి అప్పుడు ఫ్రిజ్ లో పెట్టడం మంచిది.

బంగాళదుంప:
బంగాళాదుంపలను చల్లటి ప్రదేశం అయినా ఫ్రిడ్జ్ లో ఉంచడం వల్ల అందులో చెక్కర శాతం ఎక్కువగా పెరుగుతుంది. దీనివల్ల కూరలో రుచి మారిపోతుంది.

ఉల్లిపాయలు:
మనం వంటకి ఎక్కువ మొత్తం లో ఉల్లిపాయలు కోయడం చేస్తూ ఉంటాం. అయితే కాసిని మిగిలిన ముక్కల్ని తీసుకెళ్ళి ఫ్రిజ్ లో పెడుతుంటారు. ఇలా పెట్టడం వల్ల దాని వాసన ఫ్రిజ్ మొత్తం వ్యాపిస్తుంది. ఇలా చేయకుండా మనకు కావలసిన అన్ని మాత్రమే కట్ చేసుకోవాలి .

తేనె:
ఎన్ని సంవత్సరాలైన చెడిపోని ఆహార పదార్థం అంటేనే తేనె, దీనిని ఫ్రిడ్జ్‌లో అసలు ఉంచకండి దానివల్ల తేనె రుచి మారుతుంది.

చాల మందికి అరటి పండ్లు అంటే చాల ఇష్టం అందువలన ఎక్కువగా తెచ్చుకొని పెట్టుకుంటారు . వాటిని ఫ్రిడ్జ్‌లో పెట్టకూడదు. దీని వల్ల అందులో ఉండే ఎంజైమ్స్ తగ్గిపోతాయి.

పువ్వులు:
మార్కెట్ ఉంది అంటే పువ్వులని ఎక్కువగా తెచ్చుకుంటారు .వాటిని అస్సలు ఫ్రిడ్జ్‌లో పెట్టకూడదు , వీటి వాసన వల్ల ఫ్రిడ్జ్‌లో ఉండే ఇతర ఆహారాల పైన ప్రభావం పడుతుంది.

పచ్చళ్ళు:
కాలానికి తగ్గట్లు పచ్చళ్ళు పెట్టుకుని నిల్వ ఉంచేందుకు ఫ్రిజ్ లో పెడతారు ఇవి చెడి పోకుండా ఉండటానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పచ్చళ్లను ఫ్రిజ్ లో ఉంచడం వలన వాటి రుచి మారిపోతుంది .

బ్రెడ్ పాకెట్:
బ్రెడ్ ప్యాకెట్ ఓపెన్ చేసాక మిగిలి పోయినది ఫ్రిడ్జ్ లో పెడుతుంటాం .దీనివల్ల బ్రెడ్ గట్టి పడి తినలేం. దీనిని ఫ్రిజ్ లో పెట్టాలంటే కవర్లో పెట్టి ఉంచాలి.అందువలన మనకు అవసరం ఉన్నతవరకే తెచ్చుకొని వాడుకోవలెను అలా కాకుండా ఎక్కువగా తెచ్చుకొని ఫ్రీజ్ లో పెట్టుకొని వాడడం వలన వాటిలోని పోషక పదార్థాలు నశిస్తాయి .





Untitled Document
Advertisements