రాత్రి సమయంలో ఇలా చేయడం వలన వందేళ్ల ఆయుష్షు గ్యారెంటీ..!

     Written by : smtv Desk | Thu, Apr 04, 2024, 11:36 AM

రాత్రి సమయంలో  ఇలా చేయడం వలన వందేళ్ల ఆయుష్షు గ్యారెంటీ..!

ప్రాణం అంటే ఎవరికైనా ఆశ ఉంటుంది ఆ ప్రాణాన్ని కాపాడుకోవడానికి కొన్ని ఆరోగ్యకరమైన అలవాట్లు పాటించాలి. ఆలా అయితేనే మన ఆరోగ్యం కొంత వరకు మంచిగా ఉంటుంది . అయితే చాలామందికి ఆరోగ్యంగా ఉండటం, ఆరోగ్యకర అలవాట్లు పాటించడం కష్టంగా ఉంటుంది. కానీ ఈజీగా వందేళ్ల ఆయుష్షు కావాలంటే మాత్రం రాత్రి సమయంలో ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అంతే కాకుండా రాత్రి సమయంలో ఈ 4 పదార్థాలు తినడం వల్ల 100ఏళ్లు గ్యారెంటీ అంటున్నారు ఆహర నిపుణులు. ఇంతకీ ఆ ఆహారాలేంటో చూధాం .

ప్రతి రోజు కూడా రాత్రి 7గంటలలోపు ఆహారం తీసుకుంటే దీర్ఘకాలం జీవించగలుగుతారు.ఎందుకంటే ఈ సమయంలో తినడం వల్ల ఆహారం సులువుగా జీర్ణం అవుతుంది. మనం పడుకోవడానికి కూడా చాల సమయం ఉంటుంది . దీని వలన శరీరం పోషకాలను కూడా బాగా గ్రహిస్తుంది . అంతేకాకుండా ఇవి శరీర పనితీరులో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.


రాత్రి 7 గంటలలోపు తినాల్సిన ఆహార పదార్థాలు :

శుద్ధి చేయని కార్బోహైడ్రేట్లు, మొక్కల ప్రోటీన్లు, సాధారణ చేపలను తీసుకోవడం వల్ల దీర్ఘాయువు సాధ్యమవుతుంది.ఇవే కాకుండా ధాన్యాలు, కూరగాయలు, పండ్లు, పప్పులను వెజ్ ఫుడ్‌లో భాగంగా తీసుకోవాలి.

రాత్రి త్వరగా భోజనం చేసేటప్పుడు తక్కువ కేలరీలు, మొక్కల ఆధారిత ఆహారం తీసుకోవాలి. ఇది దీర్ఘకాలం పాటూ ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది కాకుండా జీవనశైలిలో శారీరక శ్రమను కూడా చేర్చుకోవాలి.

తక్కువ చక్కెర, శుద్ధి చేసిన ఆహారాన్ని తీసుకోవడం మంచిది . డైలీ నైట్ 7 గంటలలోపు తినడం వలన మనము తిన ఆహారం ఈజీగా జీర్ణం అవుతుంది . మళ్లి ఉదయం 12 గంటలలోపు తినాలి. రోజులో మిగిలిన 12 గంటలు ఉపవాసం ఉండాలి. ఇలా చేయడం వలన ఏమైనా కొవ్వు ఉంటే కరిగిపోతుంది .అంతేకాకుండా నైట్ తిన్న తర్వాత కనీసం 20 మినిట్స్ వాకింగ్ చేయండి . దీంతో 100 ఏళ్లు జీవించాలనే కోరిక కూడా నెరవేరుతుంది. ఇది దీర్ఘాయువుకు గొప్ప మంత్రం.





Untitled Document
Advertisements