చర్మ సౌందర్య నికి విటమిన్-ఇ క్యాప్సూల్ ఎలా వాడాలి? ఎవరు వాడుకూడదు?

     Written by : smtv Desk | Thu, Apr 04, 2024, 12:19 PM

చర్మ సౌందర్య నికి   విటమిన్-ఇ క్యాప్సూల్ ఎలా వాడాలి? ఎవరు వాడుకూడదు?

అమ్మాయిలు తమ అందాన్ని కాపాడుకోవడానికి రకరకాలైన ఉత్పత్తులను ఉపయోగిస్తారు.అయితే ఎక్కువగా ట్రెండింగ్‌లో ఉన్న సౌందర్య సాధనం విటమిన్-ఇ క్యాప్సూల్. దీన్ని ముఖానికి రాసుకుంటే అందంగా కనిపిస్తామని అంటుంటారు. అయితే విటమిన్-ఇ క్యాప్సూల్ చర్మానికి ప్రయోజనకరమైనది అయినప్పటికీ, కొంతమంది దీనిని ఉపయోగించకూడదు. సరైన ఫలితాలు కావాలంటే విటమిన్-ఇ క్యాప్సూల్ ఎలా ఉపయోగించాలి?
విటమిన్-ఇక్యాప్సూల్ఎవరు ఉపయోగించకూడదు? పూర్తీగా తెలుసుకుంటే..

విటమిన్-ఇ క్యాప్సూల్ ఎలా ఉపయోగించాలి?

జిడ్డు చర్మం లేదా పొడి చర్మం లేనివారు విటమిన్-ఇ క్యాప్సూల్ ఉపయోగించవచ్చు. ఎందుకంటే ఇందులో ఉండే నూనె చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. వేసవి కాలంలో చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. చర్మంపై మెరుపును కూడా తెస్తుంది. చర్మం మరింత ఆరోగ్యంగా కనిపించేలా చేస్తుంది. దీన్ని ఒక ప్యాక్ లేదా మాస్క్‌లో మిక్స్ చేసి ముఖానికి అప్లై చేసుకోవచ్చు. అలోవెరా జెల్‌తో కలిపి బాగా అప్లై చేసి మసాజ్ కూడా చేసుకోవచ్చు.ఇలా చేయడం వలన డ్రై స్కిన్ కూడా మంచిగా కనబడుతుంది .


విటమిన్-ఇ క్యాప్సూల్ ఎవరు వాడకూడదు?
కొంత మందికి ముఖము చర్మం మీద ముడతలు పడతాయి . అలాంటి వారు ఈ విటమిన్-ఇ క్యాప్సూల్ ను ఉపయోగిస్తుంటే దీని కారణంగా చర్మ రంధ్రాలు లాక్ అవుతాయి. చర్మంపై సన్నని గీతలు కనిపించడం ప్రారంభిస్తాయి. కాబట్టి దీన్ని నేరుగా చర్మంపై ఉపయోగించకూడదు.

జిడ్డుగల చర్మంపై వద్దు:
కొంత మంది ముఖం విపరీతంగా చెమట పట్టినప్పుడు జిడ్డు చర్మంలా ఉంటుంది అలాంటి వారు దీన్ని ముఖానికి ఉపయోగించకూడదు. ఎందుకంటే ఇందులో నూనె ఎక్కువగా ఉండటం వల్ల చర్మం తడిగా కనిపిస్తుంది. మొటిమలు, చర్మం ఎరుపుగా మారడం వంటి సమస్యల ప్రభావం పెరుగుతుంది. అందువలన ఇలాంటి క్యాప్సూల్ వాడడం కంటే మన ఇంట్లో లభించే వాటితో ఫేసియల్ క్రీం చేసుకొని వాడుకోవడం మంచిది .





Untitled Document
Advertisements