పిల్లలకు ఐరన్ తక్కువగా ఉన్నప్పుడు దోశలు వేసి పెట్టండి

     Written by : smtv Desk | Fri, Apr 05, 2024, 09:34 AM

పిల్లలకు ఐరన్ తక్కువగా ఉన్నప్పుడు దోశలు వేసి పెట్టండి

సాధారణముగా అందురు ఎక్కువగా ఇస్తా పడే బ్రేక్ ఫాస్ట్ అంటే దోశ . దీనిని చేయడం కూడా చాలు సులువు ఒకసారి దోశ పిండి చేసుకుంటే ఈజీ 2 ఆర్ 3 డేస్ వరకు చేసుకోవచ్చును . అయితే ఎప్పుడు ఒకే రకమైన దోశ తినాలి అంటే మాత్రం బోర్ కొడుతుంది అందుకని ఈ సారి డిఫరెంట్ గా స్వీట్ దోశ ఓసారి ట్రై చేయండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చేయడానికి కేవలం పది నిమిషాల సమయం పడుతుంది. కాబట్టి అప్పటికప్పుడు దీన్ని చేసేయొచ్చు. స్వీట్ దోశ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.


స్వీట్ దోశ రెసిపీకి కావలసిన పదార్థాలు:

గోధుమపిండి - ఒక కప్పు
కొబ్బరి తురుము - అరకప్పు
నెయ్యి - ఒక స్పూన్
బెల్లం - 50 గ్రాములు
పాలు - అరకప్పు
బేకింగ్ పౌడర్ - చిటికెడు
యాలకుల పొడి - అర స్పూను
ఉప్పు - చిటికెడు

స్వీట్ దోశ తయారీ విధానం :
ముందుగా ఒక గిన్నెలో గోధుమ పిండిని వేసి పాలు వేసి బాగా కలపండి.
ఆ తర్వాత బెల్లాన్ని నీటిలో వేసి నీళ్లల్లో కరిగేలా చేయండి.
ఆ నీటిని కూడా గోధుమ పిండిలో వేసి బాగా కలుపుకోండి.
అందులోనే నెయ్యి, యాలకుల పొడి, బేకింగ్ పౌడర్ కూడా వేసి బాగా కలపండి. చిటికెడు ఉప్పును కూడా వేయండి.
ఇప్పుడు ఈ మిశ్రమం దోశ పిండిలా జారేలా చేయండి.తర్వాత స్టవ్ మీద పెనం పెట్టి నూనె వేయండి.
ఈ మిశ్రమాన్ని దోశెల్లా వేయండి. మాములుగా దోశ ఒకవైపు కలుస్తాము కానీ దీనిని రెండువైపులా కాల్చుకోండి.
ఒకవైపు తురిమిన కొబ్బరిని, కాస్త చక్కెర చల్లుకుంటే పిల్లలకు చాలా నచ్చుతుంది.అంతే స్వీట్ దోశ రెడీ అయినట్లే .
ఇది ఒక్కసారి పిల్లలు తిన్నారంటే ఇష్టంగా తింటారు.

ఇది కాస్త పలచగా వేస్తే క్రిస్పీగా, క్రంచీగా వస్తుంది. ఈ దోశను పిల్లలు తినేటప్పుడు చాలా ఎంజాయ్ చేస్తారు. ఒక్కసారి ఇది పిల్లలకు మీరు పెట్టి చూడండి. దీనిలో వాడిన పడ్తర్థాలు అన్ని కూడా ఆరోగ్యానికి మంచివే. బెల్లం, యాలకులు, గోధుమపిండి, కొబ్బరి, పాలు ఇవన్నీ కూడా పిల్లల ఆరోగ్యానికి మేలు చేసేవే. ఒకసారి ఈ బెల్లం దోశ వారికి తినిపించి చూడండి. వారికీ ఖచ్చితంగా నచ్చుతుంది . అంతేకాకుండా దీనిలో బెల్లం ఉండడం వలన మనకు కావలసిన ఐరన్ లభిస్తుంది . ఎవరికైనా ఐరన్ తక్కువగా ఉంటే ఇలా చేసి పెట్టండి .






Untitled Document
Advertisements