పిల్లలు క్రమశిక్షణలో ఉండాలి అంటే తలిదండ్రులు ఆచరించాల్సిన కొన్ని సూత్రాలు

     Written by : smtv Desk | Fri, Apr 05, 2024, 10:24 AM

పిల్లలు క్రమశిక్షణలో ఉండాలి అంటే తలిదండ్రులు ఆచరించాల్సిన కొన్ని సూత్రాలు

ప్రస్తుత ప్రపంచంలో పిల్లలన్ని పెంచడం అంటే అతి పెద్ద సవాల్ . ఎందుకంటే చాల మంది పిల్లలు తల్లిదండ్రులు చెప్పింది చేయరు.అదే వేరే ఎవరైనా చెబితే వింటారు . దీనికి కారణం తల్లిదండ్రులే . మాట వినడం లేదని పేరెంట్స్ పిల్లల్ని తిట్టడం, కొట్టడం లాంటివి చేస్తుంటారు.ఇలా చేయడం వలన పిల్లలు ఎక్కువగా మొండిగా తాయారు అవుతారు . అందుకని పిల్లలను ఎక్కువగా కొట్టకండి.

పిల్లలకు క్రమశిక్షణ ఎలా నేర్పించాలనేది ప్రతి తల్లిదండ్రుల మదిలో మెదిలే మొదటి ప్రశ్న. దీనికోసం ఎన్నో చేస్తుంటారు. పిల్లల్ని క్రమశిక్షణలో పెట్టడానికి చాలా మంది తల్లిదండ్రులు పిల్లల్ని కొడుతుంటారు. తిడుతుంటారు. కానీ మీ పిల్లల ప్రవర్తన బాగుండాలంటే మాత్రం చిన్న వయసు నుంచే వారికి క్రమశిక్షణ నేర్పించాలి. ముఖ్యంగా రెండు నుంచి ఐదు సంవత్సరాల వయస్సు నుంచే పిల్లల్ని క్రమశిక్షణలో పెట్టాలి. ఈ వయసు పిల్లలు తొందరగా మాట వింటారు. అసలు పిల్లలకు క్రమశిక్షణ ఎలా నేర్పించాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

పిల్లలు మన మాటల కంటే చేతల మీద ఎక్కువ శ్రద్ధ పెడతారు. అందుకే వాళ్లను క్రమశిక్షణలో పెట్టడానికి ముందు మీరు క్రమశిక్షణతో ఉండాలి. ముఖ్యంగా వారితో మాట్లాడేటప్పుడు అసభ్యకరమైన పదాలను ఉపయోగించకూడదు. ఎందుకంటే పిల్లలు మీ మాటలు బాగా వింటారు. అలాగే మాట్లాడుతారు కాబట్టి. మీరు చెడుగా మాట్లాడి మీ పిల్లలు మంచిగా మాట్లాడాలనుకోవడం దండగ. కాబట్టి వాళ్లు ఏం చేయాలో మీరే చేసి చూపించండి. మీ పిల్లలు మీరు ఎలా ఉంటే వారు కూడా అలాగే ఉంటారు. అరవడం వల్ల పిల్లలకు ఏదీ నేర్పించలేం.


పిల్లలకు ఏదైనా మంచి విషయాలు చెప్పేటప్పుడు వారి మనస్సులో తలెత్తే ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి. వాళ్లకు తెలియని విషయాలను చెప్పండి. కాదు అనుకున్న దాన్ని అవుతుందని చెప్పండి. ఇది మీ పిల్లవాడు మీరు చెప్పే ప్రతిదాన్ని జీర్ణించుకునేలా చేస్తుంది. వాళ్లు అడిగిన ప్రశ్నలకు కొట్టడం, తిట్టడం లాంటివి చేయకండి.



పిల్లల ప్రవర్తనలో తల్లిదండ్రులదే ప్రధాన పాత్ర. చాలాసార్లు తల్లిదండ్రుల వల్లే పిల్లలు తప్పులు చేస్తారు. ఎందుకంటే పిల్లలు ఏదైనా చెడు మాటలు మాట్లాడినప్పుడు తల్లిదండ్రులు ఏమీ అనకుండా నవ్వుకుంటారు. ఇతరుల విషయం పక్కన పెడితే తల్లిదండ్రులు కూడా ఇలా చేయడం మంచిది కాదు. ఎందుకంటే పేరెంట్స్ ఏమీ అనడం లేదని పెద్దవారైనా పిల్లలు అలాగే ప్రవర్తిస్తారు. మాట్లాడుతారు. దీనివల్ల తల్లిదండ్రులుగా మీకే చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి మొదటి తప్పుతోనే మీ పిల్లల్ని ఆపండి. ఇందుకోసం మీరు కోపగించుకోవాల్సిన అవసరం లేదు, తిట్టాల్సిన అవసరం లేదు, కానీ ఇది మంచి అలవాటు కాదని నిదానంగా చెప్పండి. ఇలాంటివి రిపీట్ కాకుండా చూసుకోండి. చాలాసార్లు తల్లిదండ్రులు పిల్లల కోరికలను తీర్చే ప్రయత్నంలో మొండిగా చేస్తారు. అంటే ఒకటి కావాలంటే అది కొనిచ్చిందాకా ఏడుస్తారు. అలుగుతారు. అందుకే పిల్లల కోరికకు, మొండితనానికి మధ్య తేడాను తెలుసుకోవాలి. పిల్లలు చెప్పే ప్రతిదీ తల్లిదండ్రులు చేయలేరని వారికి అర్థమయ్యేలా చెప్పాలి. పిల్లలు కోరికలను మొండితనంగా మార్చుకోకుండా ప్రయత్నించాలి.


పిల్లలు తప్పులు చేస్తే అడ్డుకోవడం ఎంత ముఖ్యమో, మంచి చేసినప్పుడు మెచ్చుకోవడం కూడా అంతే ముఖ్యం. పిల్లలు మంచి అలవాట్లు అలవర్చుకోవడానికి తల్లిదండ్రులు ప్రయత్నం చేయాలి. అలాగే వాళ్లు ఏదైనా మంచి పని చేసినప్పుడు ప్రశంసించాలి. ప్రోత్సహించండి. ఇది పిల్లలకి మంచి, చెడుల మధ్య వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్ధంలో పేటి చూడకండి కొన్ని విషయాలు చూసి చూడనట్లు పటించుకోకండి అప్పుడే పిల్లలు మీకు ఏమి అయినా చెప్పేది ఉంటే ధెర్యంగా చెబుతారు అలాంటాప్పుడు వారు ఏమైనా తప్పు చేస్తే చెప్పడానికి అవకాశం ఉంటుంది . ఈ విధంగా చేయడం వలన పిల్లలలో మంచి ప్రవర్తన నేర్పించాడని సహాయపడుతుంది .








Untitled Document
Advertisements