ద్రౌపది తన చేతులతో చేసి పెట్టినందుకే పానీ పూరీని ఆ రుచి వచ్చిందట !

     Written by : smtv Desk | Sat, Apr 06, 2024, 11:09 AM

ద్రౌపది తన చేతులతో చేసి పెట్టినందుకే పానీ పూరీని ఆ రుచి వచ్చిందట !

చిన్న పిల్లలనుండి పేదవాళ్ల వరకు పానీ పూరీని ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు . గోల్ గప్ఫా, గప్ చుప్ అని ఒక్కోక్క ప్రాతంలో ఒక్కోక్క పేరుతో పిలిచే ఈ పానీపూరీ పేరు వినగానే అందరికీ నోరూరుతుంది. ఇందులో ఉండే, డిఫరెంట్ వెరైటీస్‌ను చాలా ఇష్టంగా ఆరగిస్తుంటారు.

ఇక కాలేజీ అమ్మాయి విషయానికి వస్తే ప్రతి రోజూ పానీ పూరీ తినందే ఉండరు. అంతేకాదండో ఈ మధ్య మహిళలు కూడా మార్కెట్‌కు వెళ్లినప్పుడు సరదాగా తన ఫ్యామిలీతో పిక్నిక్ వెళ్లినప్పుడు ఎక్కువ పానీపూరీ తినడానికే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంట. ఇక పిల్లలకు కూడా పదే పదే పానీ పూరీ కావాలని అడగడంతో పేరెంట్స్ ఇంట్లో పానీపూరి చేస్తూ తన పిల్లలకు పెడుతున్నారు.

మరి ఎంతో చీప్‌గా దొరికే ఈ పానీపూరీ గురించి మీకు ఓ విషయం తెలుసా? చాలా మంది ఇది ఈ మధ్య పుట్టుకొచ్చింది అనుకుంటారు. కానీ ఈ వంటకం ఇప్పటి వంటకం కాదంట. మహాభారత కాలం నుంచే ఉన్నదంట. పురాణాల ప్రకారం పానీపూరీ ద్రౌపది కనిపెట్టిందంట. పెళ్లయ్యాక అత్త కుంతీదేవీ, ద్రౌపదికి ఒక ఆలుగడ్డ, కొంత పిడిని ఇచ్చి పంచపాండవులు ఆకలి తీర్చమంది. దీంతో ద్రౌపది వాటితో పానీ పూరీ చేసి ఆకలి తీర్చిందంట. ద్రౌపది తెలివిని మెచ్చుకున్న కుంతీదేవి, ఆ వంటకం శాశ్వతంగా ఉండిపోతుందని దీవించింది. ఆ వంటకాన్నే నేడు పానీ పూరీ, గోల్ గప్పా అంటూ వివిధ పేర్లతో పిలుచుకుంటున్నారు . అంతే కాదండోయ్ ద్రౌపది తన చేతులతో స్వయం చేసి పెట్టినందుకు ఆ వంటకానికి అంత రుచి వచిందోమో అని అందరూ అంటుంటుంటారు . అయితే మనకు
ఇప్పటి వరకు తెలియని వంటకం ఇది భారతీయ వంటకమే అని .





Untitled Document
Advertisements