భూలోకస్వర్గాన్ని తలపించే అందాల భారత్.. ఈ సమ్మర్ ట్రిప్ ప్లాన్ చేసుకోండి

     Written by : smtv Desk | Sat, Apr 06, 2024, 11:26 AM

భూలోకస్వర్గాన్ని తలపించే అందాల భారత్.. ఈ సమ్మర్ ట్రిప్ ప్లాన్ చేసుకోండి

వేసవి అనగానే అందరికి గుర్తుకు వచ్చేవి మండే ఎండలు, తట్టుకోలేని వేడి , ఉక్కపోతతో పాటు సెలవులు గుర్తుకొస్తాయి. స్కూల్స్, కాలేజీలకు సమ్మర్ హాలిడేస్ రెండు నెలల పాటు ఉంటాయి.అప్పుడు అయితేనే ఎక్కడికి అయినా వెళ్లడానికి వీళ్ళు అవుతుంది. అందుకే చాలామంది ఈ సీజన్‌లో ఫ్యామిలీ టూర్లకు వెళ్తుంటారు. సాధారణంగా వేసవి తాపం నుంచి ఉపశమనం పొందే టూరిస్ట్ స్పాట్స్‌కు వెళ్తారు. అయితే ఇందుకు దక్షిణాదిలో కొన్ని అందమైన పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. ఈ వేసవిలో కుటుంబ సభ్యులు, స్నేహితులతో టూర్ వెళ్లాలనుకుంటే ఒకసారి ఈ ప్లేసెస్ చుడండి .

* అరకు లోయ, ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో తూర్పు పర్వత శ్రేణిలో ఉన్న అరకు లోయ సహజమైన ప్రకృతి అందాలతో చూపరులకు ఆకట్టుకుంటుంది. టూరిస్టులు ఇక్కడి అద్భుతమైన అటవీ సంపద, కొండలు, లోయలు, కాఫీ తోటలు, గిరిజన సంస్కృతిని చూసి కొత్త అనుభూతి పొందవచ్చు. ఇక్కడి గిరిజన గ్రామాలకు వెళ్లి స్థానిక సంస్కృతి, సంప్రదాయాలను తెలుసుకుని, వారి వంటకాలు రుచి చూడవచ్చు.ఇక్కడికి ఫ్యామిలీ తో కలిసి వెళితే బాగా ఎంజాయ్ చేస్తారు .


* నీసం, కేరళ
ఈ ప్రాంతం కేరళలోని ఒక హిల్ స్టేషన్‌ ఈ ప్రాంతం పచ్చని పచ్చికభూములు, లోయలు, పైన్ అడవులకు ప్రసిద్ధి చెందింది. మురుగన్ హిల్, దంగల్ రాక్ వంటి టూరిస్ట్ స్పాట్స్ ఇక్కడ ఉన్నాయి. టూరిస్టులు పారాగ్లైడింగ్, పర్వతారోహణ కూడా చేయవచ్చు.ఇక్కడ మనకు తెలియని చాల రకాలైన చెట్ల ను కూడా చూడవచ్చును .


* కుమిలి, కేరళ
కేరళలోని పశ్చిమ కనుమలలో ఉన్న కుమిలి ప్రాంతం . పచ్చని కొండలు, సుగంధ ద్రవ్యాల తోటలతో అందంగా కనిపిస్తుంది. ఇక్కడికి వెళ్లే టూరిస్టులు పెరియార్ టైగర్ రిజర్వ్‌ చూసి రావచ్చు. పడవ ప్రయాణాలు చేస్తూ, ప్రశాంతమైన పరిసరాల మధ్య కూర్చొని రుచికరమైన కేరళ ఆహారాన్ని ఆస్వాదించవచ్చు.కేరళ చూడడానికి భూలోక స్వర్గంలాగా కనబడుతుంది . ఇక్కడి చెట్లు , వాతారణము ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది . ఇక్కడ కోబరి చెట్లు చాల ఏపుగా ఉంటాయి .














Untitled Document
Advertisements