తేజ సజ్జా కొత్త సినిమాలో జోడీగా రితికా ?

     Written by : smtv Desk | Sat, Apr 06, 2024, 02:59 PM

తేజ సజ్జా  కొత్త సినిమాలో జోడీగా రితికా ?

టాలీవుడ్ లో హనుమాన్ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నా హీరో తేజ సజ్జా. ఈ సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ మధ్యన సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ హనుమాన్ సినిమా టాలీవుడ్‌ ఇండస్ట్రీలో భారీ విజయాలు సాధించిన జాబితాలో చేరి పోయింది. అయితే హనుమాన్ కి సీక్వెల్‌ కి సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతోంది. ఆ గ్యాప్ లో తేజ సజ్జా ఓ భారీ కమర్షియల్‌ ఎంటర్‌ టైనర్‌ ను చేసేందుకు సిద్ధం అయ్యాడు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందబోతున్న సినిమా లో తేజ సజ్జా హీరోగా నటించబోతున్నట్లుగా ఇప్పటికే క్లారిటీ వచ్చింది.

మంజుమ్మెల్ బాయ్స్ అనే సినిమాలో హీరోగా మంచు మనోజ్ నటించబోతున్నాడు. దీని తర్వాత వీరి ఇద్దరు హీరోలు కలిసి నటించబోతున్న భారీ మల్టీ స్టారర్ మూవీ లో హాయ్ నాన్న మూవీ లో నటించి మెప్పించిన ముద్దుగుమ్మ రితికా నాయక్‌ ను ఒక హీరోయిన్‌ గా ఎంపిక చేయడం జరిగింది. తేజ కు జోడీగా రితికా నటించబోతుందని సమాచారం తెలుస్తుంది . ఈ మధ్య కాలంలో టాలీవుడ్‌ లో ఈ అమ్మడుకి మంచి గుర్తింపు దక్కింది. హాయ్‌ నాన్నకు ముందు అశోక వనంలో అర్జున కళ్యాణం వంటి సినిమా లో కూడా హీరోయిన్ గా నటించిన రితికా నటించి మెప్పించింది. రితికా తెలుగు లో ఇంకా ముందు ముందు భారీ సినిమాల్లో నటించే అవకాశాలు ఉన్నాయి. అందంతో పాటు నటనతో అలరించే సత్తా ఈ అమ్మడి సొంతం. తేజతో నటించబోతున్న ఈ సినిమా హిట్‌ అయితే ఈ అమ్మడుకి ముందు ముందు మంచి రోజులు వచ్చినట్లే , పెద్ద పెద్ద స్టార్‌ హీరోల సరసన నటించడానికి అవకాషం వస్తుంది. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారో ఇంకా మేకర్స్ క్లారిటీ ఇవ్వవలసిన అవసరం ఉంది .





Untitled Document
Advertisements