ఫైనల్ స్క్రిప్ట్ ను నానికి వివరించనున్న డైరెక్టర్ జ్ఞానవేల్‌

     Written by : smtv Desk | Sat, Apr 06, 2024, 03:12 PM

 ఫైనల్ స్క్రిప్ట్ ను నానికి వివరించనున్న డైరెక్టర్ జ్ఞానవేల్‌

టాలీవుడ్ లో హీరో నాని ఎన్నో సినిమాలు చేసాడు కానీ ఈగ సినిమాతో మంచి హిట్ హన సొంతం చేసుకున్నాడు . ఈ సినిమా తన కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది . అంతేకాకుండా గత ఏడాది మార్చిలో దసరా మూవీతో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన నాని అదే జోష్ తో హాయ నాన్న సినిమా చేశారు. శౌర్యువ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఫస్ట్ షో నుంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోయి బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు నాని. ఈమధ్య కాలంలో కంటిన్యూగా సినిమాలు ప్రకటిస్తున్నారు. అంటే సుందరానికి మూవీ తీసిన వివేక్ ఆత్రేయతో కలిసి సరిపోదా శనివారం చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీపై మంచి హైప్ క్రియేట్ అయింది

ఈ సినిమాతో పాటు నాని చేతిలో అనేక సినిమాలు ఉన్నాయి. డీవీవీ బ్యానర్ లో ఓజీ సుజిత్ తో కలిసి వర్క్ చేయనున్నారు నాని. ఇటీవల దసరాతో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన శ్రీకాంత్ ఓదెలతో మరో సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ రెండు సినిమాలు 2024 లోనే ప్రారంభం కానున్నాయి. బలగం వేణుతో చేయనున్న ప్రాజెక్ట్ వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లనున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇటీవల నాని మరో మూవీకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. జైభీమ్ ఫేమ్ టీజే జ్ఞానవేల్‌ కొన్ని రోజుల క్రితం నానికి స్క్రిప్ట్ వినిపించారు. కథ నచ్చి ఫైనల్ స్క్రిప్ట్ పై నాని వర్క్ చేయమన్నారట. ప్రస్తుతం ఆ పనిలో బిజీగా ఉన్న జ్ఞానవేల్‌ ఫైనల్ స్క్రిప్ట్ ను త్వరలోనే నానికి వివరించనున్నట్లు తెలుస్తోంది. అన్నీ కుదిరితే నాని- జ్ఞానవేల్‌ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లనుందని వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే అఫీషియల్ అప్డేట్ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం జ్ఞానవేల్ రజనీకాంత్ తో తలైవర్ 170 సినిమా చేస్తున్నారు. ఈ మూవీలో అతిథి పాత్రలో కూడా నాని నటిస్తారని అప్పట్లో వార్తలు తెగ వైరల్ గా వచ్చాయి. నెగిటివ్ రోల్ లో కనిపించనున్నట్టు టాక్ వినిపించింది. అయితే ఆ రోల్ నచ్చక నాని సున్నితంగా రిజెక్ట్ చేశారని తర్వాత తెలిసింది. అప్పుడు జ్ఞానవేల్‌ అడిగిన ఆ సినిమాలో నటించడానికి నో చెప్పిన నాని ఇప్పుడు ఆయన చెప్పిన కథ విని ఒప్పుకున్నాడు అని అర్థం అవుతుంది . ఏది ఏమైనా నాని మాత్రం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు . .





Untitled Document
Advertisements