ఉగాది పచ్చడి. ఇది తింటే ఆ సమస్యలు దూరం..

     Written by : smtv Desk | Sat, Apr 06, 2024, 04:10 PM

ఉగాది పచ్చడి. ఇది  తింటే ఆ సమస్యలు దూరం..

మన తెలుగు వారికీ కొత్త సంవత్సరం అనగానే గుర్తుకు వచ్చేది ఉగాది పండుగ . ఇంకా కొన్ని రోజులలో ఈ ఉగాది పండుగ రానే వస్తుంది. ఈ పండుగ రోజున చాలా మంది ఉగాది పచ్చడి చేస్తారు. దీనిని చాలా మంది ఇష్టంగా తింటారు. ఇది రుచిగా మాత్రమే కాదు. దీనిని తినడం వల్ల ఆరోగ్యం కూడా.ముఖ్యంగా ఆరు రుచుల కలయికతో చేసే ఈ పచ్చడి తింటే ఏమేం సమస్యలు దూరమవుతుంది.

ఆరు రుచులు.. ఉగాది పచ్చడిని పులుపు, ఉప్పు, తీపి, కారం, చేదు వంటి రుచులతో కలిపి చేస్తారు. జీవితంలోని ఆరు భావాలకు అనుగుణంగా ఈ రుచులతో ఈ పచ్చడి తయారు చేస్తారు. ఆయుర్వేదం ప్రకారం, ఉగాది వాత, పిత్త, కఫా మూడు దోషాలను బ్యాలెన్స్ చేస్తుంది. దీంతో బాడీలో ఏదైనా దోషం ఉంటే అది తగ్గిపోతుంది. దీని వల్ల బాడీ డీటాక్స్ అవుతుంది. రాబోయే సీజన్‌ కోసం మన బాడీని రెడీ చేస్తుంది. ఈ పచ్చడిని తింటే ఋతువుల కోసం మన బాడీని ఫిజికల్లీ, మెంటల్లీ రెడీ చేస్తుంది.

పులుపు.. ఉగాది పచ్చడిలో వేసవిలో వచ్చే మామిడికాయల్ని వేస్తారు. దీని వల్ల రక్తప్రసరణ మెరుగవుతుంది. డీహైడ్రేషన్, వడదెబ్బని తగ్గిస్తుంది. ఇందులో విటమిన్ సి ఉండడం వల్ల కడుపులోని సమస్యల్ని తగ్గిస్తుంది. జీర్ణక్రియని మెరుగ్గా చేస్తుంది.కొత్త చింతపండు గుజ్జు ను కూడా వాడుతారు ఆయుర్వేదంలో డెడ్ స్కిన్ టిష్యూని తొలగించడానికి డీటాక్స్ చేయడానికి వాడతారు. మామిడిపండ్లు డీహైడ్రేషన్‌ని తగ్గిస్తుంది. మార్నింగ్ సిక్‌నెస్‌లో వికారాన్ని తగ్గిస్తాయి. గుండె, కాలేయం, ప్రేగుల ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

తీపి.. ఇందులో బెల్లాన్ని కలుపుతారు. దీని వల్ల జీర్ణకోశ సమస్యలు, మూత్రాశయ సమస్యలు దూరమవుతాయి. గుండె పనితీరు మెరుగవుతుంది. రక్తహీనత తగ్గుతుంది. బాడీపై పాజిటీవ్ ఎఫెక్ట్ పడుతుంది. సహజంగా తియ్యగా ఉండడమే కాకుండా జీర్ణక్రియని మెరుగ్గా చేస్తుంది. మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. అదే విధంగా లివర్‌ని డీటాక్స్ చేస్తుంది.

చేదు.. ఉగాది పచ్చడిలో చేదుని కలుపుతారు.చేదు కోసం వేపపువ్వును వాడతారు . ఇది దాదాపు 35 ఆరోగ్య సమస్యలతో పోరాడుతుందని ఆయుర్వేదం చెబుతుంది. దీని వల్ల పిత్త దోషం తగ్గి కడుపులోని బ్యాక్టీరియాని నాశనం చేస్తుంది. షుగర్ కంట్రోల్ అవుతుంది. రక్త ప్రసరణని మెరుగ్గా చేస్తుంది. దీంతో

ఉప్పు.. ఉగాది పచ్చడిలో వాడే ఉప్పు వాతాన్ని తగ్గిస్తుందని ఆయుర్వేదం చెబుతుంది. బాడీలో సోడియం నష్టాన్ని తగ్గిస్తుంది. డీహైడ్రేషన్, ఆర్థరైటిస్ సమస్యని తగ్గిస్తుంది. సోడియం ఉండడం వల్ల డీహైడ్రేషన్‌ని తగ్గించి ఐరన్ కంటెంట్‌ని బ్యాలెన్స్ చేస్తుంది. ద్రవం నిలుపుదలని తగ్గిస్తుంది. దంత ఆరోగ్యాన్ని కాపాడి, బ్రెయిన్ పనితీరుని మెరుగ్గా చేస్తుంది.

కారం.. ఈ పచ్చడిలో కారానికి సూచనగా మిరియాలు కలుపుతారు. దీనిని వాడడం వల్ల కడుపునొప్పి, చర్మ సమస్యల్ని దూరం చేస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంది. ఇది ఊపిరితిత్తులకి మంచిది.

వీటిని ఉపయోగించడం అంటే కేవలం ఆరోగ్యము కోసమే మాత్రమే కాదు. మన జీవితం కూడా ఈ ఆరు రుచుల సమ్మెళనము అని చెప్పడానికి ఈ ఉగాది పండుగ రోజున ఉగాది పచ్చడిని చేసుకొని ఇంట్లో ఉన్న వాళ్ళు అందరూ తింటారు .






Untitled Document
Advertisements