ఓటీటీ పై తెలుగు సినిమాల సందడి.. ఈ శుక్రవారం రిలీజ్ అవుతున్న సినిమాలివే!

     Written by : smtv Desk | Wed, Apr 10, 2024, 11:20 AM

ఓటీటీ పై తెలుగు సినిమాల సందడి..  ఈ శుక్రవారం రిలీజ్ అవుతున్న సినిమాలివే!

సమ్మర్ అంటే హాలిడేస్.. హాలీడేస్ అంటే సినిమాలు. మరి రోజు థియేటర్ లకు వెళ్లి సినిమాలు చూడాలి అంటే ఈ ఎండల వేడికి అయ్యేపని కాదు. అందుకే సినిమా లవర్స్ కొరకు ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ శుక్రవారం ఓటీటీ సెంటర్ లో సందడి కాస్త గట్టిగానే కనిపించనుంది. మూడు తెలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాయి. ఆ జాబితాలో 'గామి' .. 'ఓం భీమ్ బుష్' .. 'ప్రేమలు' కనిపిస్తున్నాయి. విష్వక్ సేన్ హీరోగా విద్యాధర్ రూపొందించిన 'గామి', మార్చి 8వ తేదీన థియేటర్లకు వచ్చింది. విభిన్నమైన సినిమాగా ఆడియన్స్ నుంచి మార్కులు కొట్టేసింది. అలాంటి ఈ సినిమా, ఈ నెల 12వ తేదీన జీ 5 ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి రానుంది. ఇక ఇదే రోజున అమెజాన్ ప్రైమ్ వీడియోలో ' ఓం భీమ్ బుష్' సినిమా స్ట్రీమింగ్ కానుంది. శ్రీవిష్ణు - ప్రియదర్శి - రాహుల్ రామకృష్ణ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, మార్చి 22వ తేదీన థియేటర్లకు వచ్చింది. శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వం వహించిన ఈ సినిమా, నాన్ స్టాప్ కామెడీని అందించింది. అయేషా ఖాన్ గ్లామర్ ఈ సినిమాకి అదనపు ఆకర్షణగా నిలిచింది. ఇక 'ప్రేమలు' విషయానికి వస్తే, విడుదలైన ప్రతి భాషలో ఈ సినిమా విజయాన్ని సాధించింది. ఈ సినిమా ఎప్పుడు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి వస్తుందా అని ఎదురుచూసేవారు ఎక్కువగానే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా 'ఆహా' తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ద్వారా ఈ నెల 12వ తేదీ నుంచి పలకరించనుంది. 135 కోట్ల వరకూ కొల్లగొట్టినఈ సినిమా, ఓటీటీ వైపు నుంచి ఎన్ని మార్కులు కొట్టేస్తుందనేది చూడాలి.


Untitled Document
Advertisements