భూమి పై నదులు ఏ విధంగా ఏర్పడ్డాయంటే..

     Written by : smtv Desk | Thu, Apr 11, 2024, 11:39 AM

భూమి పై నదులు ఏ విధంగా ఏర్పడ్డాయంటే..

నదులు మనకు ప్రధాన జీవనాధారం. తగు నీటి కొరకు నదులపై ఆధారపడుతుంటాము. అయితే సాధారణంగా ఎప్పుడు నీటితో నిండు కుండలా కనిపించే నదులను చూసినప్పుడు ఈ నదులు ఎవరు తవ్వించారు. ఎన్ని రోజులు తవ్వి ఉండొచ్చు, ఎంతమంది తవ్వి ఉండొచ్చు అనే ప్రశ్నలు మనలో రేకేత్తుతాయి. అయితే అసలు ఈ నదులు ఏర్పడడానికి గల కారణాలు ఏంటి? మహావిస్ఫోటనం (బిగ్ బ్యాంగ్) తరువాత సముద్రాలు, పర్వతాలు ఏర్పడ్డాయి. నదులు లేవు. ఏకధాటిగా కురిసిన వర్షాల వలన పర్వతాల మీద పడిన నీరు కిందకు ప్రవహించి, పల్లపు ప్రాంతాల నుంచి కాల్వలుగా బయలుదేరి సముద్రంలోనే కలిసేవి. ఈ విధంగా సముద్రం దిశగా ప్రయాణించిన వర్షపు నీటి ప్రవాహాలు ఎత్తు పల్లాలను అనుసరించి కొన్ని వెడల్పుగా, మరికొన్ని లోతుగా ఏర్పడ్డాయి. ఈ నీటి ప్రవాహాలే బాగా పల్లంగా ఉన్న ప్రాంతాలలో నదులుగా అవతరించి స్థిరపడ్డాయి. నదులు ఏర్పడటానికి ఇది ప్రాధమిక కారణం. పర్వతాల మీద పడిన నీరు అతిశీతల వాతావరణంలో మంచు దిమ్మలుగా ఏర్పడి వేసవిలో కరిగి కిందకు ప్రవహించడంతో మరో కోణంలో నదులు పుట్టాయి. ప్రకృతి రిత్యా ఏర్పడిన సరస్సులు, భు అంతర్భాగం నుంచి వెలుపలికి తన్నుకువచ్చే నీటి చలమలు కూడా కొన్ని నదులుగా జన్మిస్తాయి.

Untitled Document
Advertisements