వైరల్ అవుతున్న రాజ‌మౌళి దంప‌తులు డ్యాన్స్‌ రిహార్స‌ల్స్ వీడియో

     Written by : smtv Desk | Thu, Apr 11, 2024, 11:50 AM

బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాలతో పాన్ ఇండియా దర్శకుడిగా మారిన రాజమౌళి గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. దర్శకదీరుడు ఎస్ఎస్ రాజ‌మౌళి తాలూకు వీడియో ఒక‌టి ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. వీడియోలో ఆయ‌న త‌న భార్య ర‌మ‌తో క‌లిసి డ్యాన్స్ రిహార్స‌ల్స్ చేస్తుండ‌డం మ‌నం చూడొచ్చు. ఇటీవ‌ల ఓ వివాహ వేడుక‌లో పాల్గొని రాజ‌మౌళి దంప‌తులు డ్యాన్స్ చేసిన విష‌యం తెలిసిందే. దీనికి సంబంధించిన రిహార్స‌ల్స్ వీడియో తాజాగా బ‌య‌ట‌కు రావ‌డంతో ఇప్పుడు అది కాస్తా వైర‌ల్ అవుతోంది.

మైత్రి మూవీ మేక‌ర్స్ సీఈఓ చెర్రీ కూతురు పెళ్లి ఇటీవ‌ల ఘ‌నంగా జ‌రిగింది. ఈ వేడుక‌లో పాల్గొన్న రాజ‌మౌళి త‌న భార్య ర‌మ‌తో క‌లిసి డ్యాన్స్ చేసిన‌ట్లు క‌థ‌నాలు వెలువ‌డ్డాయి. ప్ర‌ముఖ నృత్య‌ద‌ర్శ‌కుడు ప్ర‌భుదేవా ఆల్‌టైమ్ హిట్స్‌లో ఒక‌టైన 'అంద‌మైన ప్రేమ‌రాణి' పాట‌కు ఈ క‌పూల్ స్టెప్పులేశారు. దీనికి సంబంధించిన రిహార్స‌ల్స్ వీడియో నెట్టింట వైర‌ల్ అవుతోంది. దీనిపై నెటిజ‌న్లు త‌మ‌దైన శైలిలో స్పందిస్తున్నారు.

ఇక రాజ‌మౌళి ప్ర‌స్తుతం సూపర్‌స్టార్ మ‌హేశ్ బాబుతో చేసే సినిమా ప‌నుల్లో బిజీగా ఉన్నారు. యాక్ష‌న్ అడ్వెంచ‌ర్‌గా ఈ చిత్రం ఉంటుంద‌ని క‌థ ర‌చ‌యిత విజేంద్ర‌ప్ర‌సాద్ ఇప్ప‌టికే వెల్ల‌డించారు. భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రంలో హాలీవుడ్ టెక్నీషియ‌న్స్ కూడా భాగం కానున్నారు.
https://twitter.com/SureshPRO_/status/1778264546328875292?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1778264546328875292%7Ctwgr%5E45d598a60b9bcf8f8f3f76351307c536e8697577%7Ctwcon%5Es1_c10ref_url=https%3A%2F%2Fwww.ap7am.com%2Ftn%2F798565%2Fss-rajamouli-dance-with-rama-rajamouli-video-goes-viral-on-social-media


Untitled Document
Advertisements