మెట్లు దిగడం కన్నా ఎక్కడం కష్టం ఎందుకంటే?

     Written by : smtv Desk | Thu, Apr 11, 2024, 12:18 PM

మెట్లు దిగడం కన్నా ఎక్కడం కష్టం ఎందుకంటే?

ఎంత దూరం అయినా సునాయాసంగా నడిచేస్తుంటాం. కాని, ఒక రెండు అంతస్తుల భవనం పైకి మెట్లమార్గం గుండా వెళ్ళమంటే బాబోయి నావల్ల కాదు నేను మెట్లు ఎక్కలేను అంటూ చేతులేత్తేస్తుంటారు. అదే పై నుండి దిగేటప్పుడు మాత్రం సునాయాసంగా దిగేస్తుంటారు. అసలు ఇలా పైకి వెళ్ళడానికి ఇబ్బంది పడుతూ, కిందకి మాత్రం సులువుగా రావడానికి గల కారణం ఏమిటి అని ఆలోచిస్తున్నారా? ఇలా జరగడానికి కారణం భూమి ఓ పెద్ద అయస్కాంతమని, దానికి బలమైన ఆకర్షణ శక్తి ఉందనేది మనకు తెలుసు. మెట్లెక్కి పైకి వెళుతున్నామంటే మన దిశ భూమియొక్క ఆక్షరణ దిశకు వ్యతిరేకంగా ఉంటుంది. అంటే మెట్లెక్కుతుంటే భూమి మనల్ని క్రింద వైపుకు లాగుతూ ఉంటుంది. ఎవరైనా మనల్ని ముందుకు వెళ్ళకుండా ఆపితే విడిపించుకోవడానికి ఎక్కువ శక్తిని ఉపయోగించాలి కదా! అందుకే మనకు కష్టంగా ఉంటుంది. క్రిందకి దిగేటప్పుడు మనం వెళ్ళే దిశ మరియు భూమి ఆకర్షణ శక్తి రెండూ ఒకే వైపుంటాయి. అంటే క్రిందకి దిగేందుకు భూమి మనకు సహకరిస్తుంది. భూమి ప్రభావం వల్లనే ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది.

Untitled Document
Advertisements