పాలు ఎందుకు పొంగుతాయి? పొంగకుండా ఉండాలంటే ఏంచేయాలి?

     Written by : smtv Desk | Thu, Apr 11, 2024, 12:27 PM

పాలు ఎందుకు పొంగుతాయి? పొంగకుండా ఉండాలంటే ఏంచేయాలి?

ప్రతిరోజు ఉదయం వంటగదిలో మినీ యుద్ధం చేస్తుంది ప్రతి ఇల్లాలు. ఉదయాన్నే స్కూల్ కు వెళ్ళే పిల్లలు, ఆఫీస్ కు వెళ్ళే భర్త కొరకు సమయానికి అన్ని సమకూర్చే క్రమంలో అటు ఇటు పరుగులు పెడుతూనే ఉంటారు. అటువంటి సమయంలో పాలు పోయిమీద పెట్టి ఏమాత్రం ఏమరపాటుగా ఉన్న పాలు పొంగిపోయి నేలపాలు అవుతాయి. పాలు పోవడమే కాకుండా పోయ్యి అలాగే పొయిగట్టు కూడా పాడయిపోతుంది. పాలు నేలపాలు అవడంతో పాటు మనకి ఎక్స్ట్రా వర్క్. అసలు పాలు పొంగడానికి గల కారణాలు ఏమిటి? పాలు పొంగిపోకుండా ఏమైనా చిట్కాలున్నాయా! చూసేద్దాం..
పాలు ఒక మిశ్రమ పదార్ధం. ప్రోటీన్లు, కొవ్వులు, లాక్టోజ్, నీరు ఇంకా అనేక పదార్థాలు కలసి ఉంటాయి. పాలను కొద్దిగా వేడిచేసినప్పుడు ప్రోటీన్లు, కొవ్వులు విడిపోతాయి. పాలలోని మిగితా పదార్థాల కంటే తేలికగా ఉంటాయి. కాబట్టి అవి పైన పేరుకుంటాయి. దాన్నే మనం ' మీగడ ' అంటాము. పాలను మరింతగా వేడిచేస్తే దానిలోని నీరు ఆవిరిగా మారి బయటకి రావాలని ప్రయత్నిస్తుంది. అయితే దాని మార్గానికి అడ్డుగా మీగడ ఉంటుంది. మీగడను బయటకి నెట్టి పైకి రావాలని నీటి ఆవిరి చేసే ప్రయత్నంలో పాలు పొంగుతాయి. అయితే నీటి ఆవిరి వెళ్లేందుకు ఒక మార్గం ఏర్పరిస్తే పాలు పొంగవు దానికో చిట్కా ఉంది. పొడవాటి కాడా ఉన్న చెంచా లేదా గరిటెను పాల గిన్నెలో ఉంచితే నీటి ఆవిరి ఆ చెంచాకాడా వెంబడి బయటకు వెళుతుంది. ఆ విధానం వల్ల ఎంత వేడి చేసినా పాలు పొంగవు.





Untitled Document
Advertisements