ఎటువంటి ఒత్తిడి లేకుండా వైవాహిక బంధాన్ని ఆస్వాదించాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి

     Written by : smtv Desk | Thu, Apr 11, 2024, 04:17 PM

ఎటువంటి ఒత్తిడి లేకుండా వైవాహిక బంధాన్ని ఆస్వాదించాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి

ఈ మధ్యకాలంలో యువత ఎంత తొందరగా ప్రేమలో పడి పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారో అంటే తొందరగా విడాకుల పేరుతో విడిపోతున్నారు. పైగా వాళ్ళు విడిపోవడానికి చూపించే కారణాలు కూడా చాలా సిల్లీగా కనిపిస్తాయి. ఇలా నూరేళ్ళ బంధాన్ని నూరు రోజుల్లో ముగించడానికి గల కారణాలు, కలిసుండడానికి పాటించాల్సిన నియమాలు ఇప్పుడు తెలుసుకుందాం..
పెళ్లి కి ముందు అన్నీ మీకు నచ్చినట్టు చేసిన మీరు ,పెళ్లయ్యాక మీ భాగస్వామి కోసం కొన్ని అలవాట్లని ,అభిరుచులను మార్చుకోవాల్సి వస్తుంది. మొదట్లో పార్టనర్ మీద మీకున్న ఇష్టం,ప్రేమ కారణంగా మొదట్లో ఇబ్బందిగా అనిపించకపోయినా రోజులు గడిచే కొద్ది అది మిమ్మల్ని కొంత ఇబ్బందికి గురి చేస్తుంది.
అప్పుడు మీరు ఆ విషయాన్ని అవతల వారికి చెప్పడానికి ప్రయత్నించినప్పుడుఅవతలి వారు సరిగా రిసీవ్ చేసుకుంటే పర్వాలేదు. కానీ, కొంత మంది ఆ విషయాన్ని అర్థం చేసుకోకపోగా అపార్థం చేసుకుంటారు. దాని వల్ల చిన్నగా గొడవలు మొదలవుతాయి. అందులో భాగంగా పెళ్ళయిన కొత్తలో నువ్విలా లేవు ఇప్పుడు మారిపోయావు అంటూ మాటల యుద్దం మొదలవుతుంది. మరి కొంత మంది వాళ్ళకి సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని తమ తోబుట్టువులతోనో,ఫ్రెండ్స్ తోనో పంచుకునే అలవాటు ఉంటుంది. అది వారి భాగస్వామికి నచ్చక పోవచ్చు. వారి పర్స్నల్ విషయాలు బయట చెప్పకూడదు అన్నప్పుడు ఇవతలి వారు వారి మాటలను నిర్లక్ష్యం చెయ్యడం వల్ల కూడా భార్య భర్తల మధ్య గొడవలు ,అభిప్రాయ భేధాలు మొదలవుతాయి.

మీ బంధం ఆనందంగా సాగిపోవడానికి కొన్ని చిట్కా లను పాటించండి ...
* ముందు ఒకరి అలవాట్లని ,అభిరుచులను ఒకరు గమనించండి. వీలైతే ఒకరి అభిరుచులను ఒకరు గౌరవించండి.
* ముందుగా నిద్ర లేచిన వారు, మీ భాగస్వామి నుదిటిన చిన్న ముద్దిచ్చి,చిరునవ్వుతో వాళ్ళకి గుడ్ మార్నింగ్ చెప్పండి.
* ఇద్దరు కలిసి వాకింగ్ చేయండి, లేదా వ్యాయామం చేయండి. ఎక్కడికో వెళ్ళి చెయ్యక్కర్లేదు. కాస్త స్థలం ఉంటే మీ బాల్కనీలో లేదా మీ పెరట్లో కూడా చెయ్యొచ్చు.
* ఉదయాన్నే కలిసి కాఫీ తాగుతూ చక్కగా ఓ ఐదు నిముషాలు కబుర్లు చెప్పుకోండి. మీ ఆవిడ కిచెన్ లో వంట చేస్తుంటే మీరు కూరలు తరుగుతూ కబుర్లు చెప్పండి.
* ప్రతి దాన్ని ఆన్ లైన్ షాపింగ్ లో కొనకుండా అప్పుడప్పుడు ఇద్దరు కలిసి షాపింగ్ కి వెళ్ళండి. నెలలో ఒక్కసారైనా ప్రాజెక్ట్ లు, డెడ్ లైన్ లు అన్నీ వదిలేసి అలా సరదాగా ఔటింగ్ కి వెళ్ళండి. ఇలా వెళ్ళడం వలన ఒకరితో ఒకరు గడిపే సమయం దొరుకుతుంది.
* ఒకరితో ఒకరు వీలైనంత ఎక్కువ సమయం గడపండి. ఒకరి ఇష్ట్టయిష్టాలను ఒకరు గౌరవించండి.
* అనుకోకుండా మీ మధ్య ఏదైన మాట మాట వస్తే ,ఆ క్షణం మరొకరు మౌనం గా ఉండండి. ఎందుకంటే ఆ క్షణం ఆవేశంలో మీరు జారే కొన్ని మాటలు, మీ బంధాన్ని బలహీనం చేస్తాయి. కాబట్టి ఆ క్షణం మీ మౌనం విలువ మీ జీవితం అని గుర్తుంచుకోండి.
* మీ మధ్య ఏదైన గొడవ జరిగినప్పుడు మూడో వ్యక్తిని మీ గొడవలో ఇన్వల్వ్ చేయకండి. అది మీ ఇద్దరి విలువని తగ్గిస్తుందని గుర్తుంచుకోండి.
* సమస్య వచ్చింది మీకు ,దాని పర్యవసానం అనుభవించేది మీరు కనుక పరిష్కారాన్ని కూడా వెతుక్కోవాల్సింది కూడా మీరే అనే విషయాన్ని గుర్తించండి.

“ఇంటగెలిచి రచ్చ గెలవమన్నారు”మన పెద్దలు
అందుకే మీ భాగస్వామిని మీరు అర్థం చేసుకుంటూ.. వారు మిమ్మల్ని అర్థం చేసుకొనే అవకాశాన్ని వారికి ఇస్తూ.. మీ జీవితాన్ని ఆనందంగా జీవిస్తూ.. మీ చుట్టూ ఉండే నలుగురికి మీరు అదర్శ ప్రాయంగా ఉండేలా మిమ్మల్ని మీరు మార్చుకోండి.

Untitled Document
Advertisements