మరణించిన వ్యక్తి అంత్యక్రియలకు వెళ్ళిన వారిని స్నానం చేసి ఇంట్లోకి రమ్మంటారు ఎందుకు ?

     Written by : smtv Desk | Thu, Apr 11, 2024, 04:24 PM

మరణించిన వ్యక్తి అంత్యక్రియలకు వెళ్ళిన వారిని స్నానం చేసి ఇంట్లోకి రమ్మంటారు ఎందుకు ?

పురాతన కాలం నుండి నేటి ఆధునిక కాలం వరకు అన్ని విషయాలలోనూ ఎన్నో మార్పులు, చేర్పులు చోటు చేసుకున్నాయి. కాని నాటి నుండి నేటి వరకు కూడా అంత్యక్రియలకు వెళ్లి వచ్చినవారు లేదా శ్మశానము నుండి వచ్చిన వారు శరీరం పై దుస్తువులు ఉంచుకునే స్నానం చేయాలని సంప్రదాయం. అంత్యక్రియల నుండి వచ్చాక స్నానం చేయపోతే చనిపోయినవారి ఆత్మ వీరిని వెంటాడుతుందని చెప్పేవారు. ఆత్మ విషయం ఎలా ఉన్నా ఈ సంప్రదాయం వెనుక ఒక ఆరోగ్య రహస్యం ఉంది. మరణించిన వ్యక్తి శరీరం నుండి అనేక విషక్రిములు బయటకు వస్తాయి. ఇవి దేహం చుట్టుతా ఆవహించాబడి ఉంటాయి. ఎవరైతే శవాన్ని తాకుతారో వారిపై ఈ క్రిముల ప్రభావం కనిపించవచ్చు. ఈ విషక్రిముల బారిన పడకుండా తప్పించుకోవడానికే బట్టల పైనుండే తలారా చన్నీటి స్నానం చేయాలని చెప్పటం జరిగింది.
విషక్రిములు బట్టలపై కూడా ఉంటాయి కాబట్టి బట్టలు కూడా నీటిలో తడిచేలా స్నానం చేయాలని ఒక ఆచారంగా చెప్పారు. ఈ విశ్వాసంలో పరిశుభ్రతతో పాటు రోగాల బారిన పడకుండా ఉండే ఏర్పాటు ఉంది. విషక్రిములు శ్వాసధ్వారా వారి శరీరములోనికి వెళ్లి ఉండవచ్చునని భావముతో అంత్యక్రియలకు వెళ్లి వచ్చినవారు స్నానం తరువాత "వేపాకు" నమిలి ఇంట్లోకి ప్రవేశించమంటారు.





Untitled Document
Advertisements