ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఆ రోజు నుండి స్టార్ట్

     Written by : smtv Desk | Sun, Apr 28, 2019, 06:15 PM

ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు  ఆ రోజు నుండి స్టార్ట్

ఇంటర్‌ ఫలితాల్లో తలెత్తిన సమస్యల కారణంగా మే 16వ తేదీ నుంచి జరగాల్సిన ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను వాయిదా వేశారు. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు మే 25 తేదీకి వాయిదా వేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. మే 25వ తేదీ నుంచి జూన్ 4వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనుండగా.. జూన్ 7వ తేదీ నుంచి జూన్ 10 తేదీ వరకు ఇంటర్ సప్లిమెంటరీ ప్రయోగ పరీక్షలు (ప్రాక్టికల్స్) జరుగనున్నట్టుగా ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ స్పష్టం చేశారు. సప్లిమెంటరీ ఫలితాలకు ముందే రీ వెరిఫికేషన్‌, రీకౌంటింగ్‌ ఫలితాలు వెల్లడిస్తామన్నారు.





Untitled Document
Advertisements