అద్భుతమైన ప్రకృతి అందాల నడుమ రాజన్న సిరిసిల్ల

     Written by : smtv Desk | Tue, Mar 02, 2021, 04:17 PM

అద్భుతమైన ప్రకృతి అందాల నడుమ రాజన్న సిరిసిల్ల

సిరిసిల్ల సిగలో మరో కలికితురాయి. తొందర్లోనే అందుబాటులోకి రానున్న అర్బన్ పార్క్ .అమాత్యుని సంకల్పంతో ఆహ్లాదకేంద్రంగా అటవీతీరం సువిశాలమైన అటవీ ప్రాంతం. పక్షుల కిలకిలరావాలు. నలువైపులా నీటి కుంటలు. కళ్ల ముందే కదలాడతున్న నెమళ్ళు. ఎటు చుసిన పచ్చదనం. అద్భుతమైన ప్రకృతి అందాల నడుమ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి 10 కిలోమీటర్ల దూరంలోని వెంకటాపూర్-హరిదాసునగర్ గ్రామాల నడుమ అటవీ ప్రాంతంలో సిరిసిల్ల అర్బన్ పార్క్ రూపుదిద్దుకోబోతుంది.
సిరిసిల్ల పట్టణంతో పాటు జిల్లా ప్రజలు ప్రశాంత అటవీ వాతావరణం లో ఒక రోజంతా గడిపేలా యోగ కేంద్రం, వాకింగ్ ట్రాక్, సైక్లింగ్ ట్రాక్, ఉద్యానవనాలు, పిల్లల ఆటస్థలాలు, అడ్వెంచర్ గేమ్స్, ఫుడ్ కోర్టులు, అన్ని సౌకర్యాలతో పార్క్ నిర్మాణం జరుగుతుంది.

Untitled Document
Advertisements