నా కోసం ట్రాఫిక్‌ను ఆపొద్దు

     Written by : smtv Desk | Thu, Jun 17, 2021, 07:10 PM

నా కోసం ట్రాఫిక్‌ను ఆపొద్దు

సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన అనంతరం తొలిసారి జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌ హైదరాబాద్‌కు వచ్చారు. నిన్న యాదాద్రికి వెళ్ళి ల‌క్ష్మీన‌ర్సింహ‌స్వామిని దర్శించుకున్నారు ఎన్వీ ర‌మ‌ణ దంప‌తులు. ప్రస్తుతం రాజ్‌భ‌వ‌న్‌లో బ‌స చేస్తున్న ఎన్వీ రమణను ప్రతిరోజూ ప‌లువు‌రు ప్ర‌ముఖులు క‌ల‌సి శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు. మ‌రోవైపు ఇత‌ర ప్ర‌ముఖుల‌ను క‌లిసిందేకు ఆయ‌న కొన్ని సార్లు హైద‌రాబాద్‌లో ప‌ర్య‌టిస్తున్నారు.


ఇందులో బాగంగా ఎస్ఆర్ నగర్ లోని తన నివాసానికి వెళ్తున్న సమయంలో ట్రాఫిక్ ను నిలిపివేశారు పోలీసులు. ఇది గుర్తించిన సీజేఐ ఎన్వీ ర‌మ‌ణ తన పర్యటనలో తనకోసం ట్రాఫిక్‌ను నిలిపివేసి ప్రజలకు అసౌకర్యం కలిగించవ‌ద్ద‌ని సూచించారు. అయితే ఈ నెల 19వ తేదీ వ‌ర‌కు హైద‌రాబాద్‌లోని రాజ్‌భ‌వ‌న్‌లో బ‌స చేయ‌నున్నారు సీజేఐ ఎన్వీ ర‌మ‌ణ‌.

Untitled Document
Advertisements